ePaper
More
    Homeఅంతర్జాతీయంNepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. సోషల్​ మీడియాపై బ్యాన్​ విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఆయన సీటుకే ఎసరు పెట్టింది.

    నేపాల్​ ప్రభుత్వం(Nepal Government) ఇటీవల పలు సోషల్​ మీడియా యాప్​లను నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని వాటిని బ్యాన్​ చేసింది. అయితే నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశ యువతకు నచ్చలేదు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సోషల్​ మీడియాపై బ్యాన్(Social Media Ban)​ ఎత్తివేయాలని, ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ఖాట్మాండ్​లో నిరసన తెలిపారు.

    Nepal PM Resigns | పలువురి మృతి

    నేపాల్ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వారు పార్లమెంట్​ను ముట్టడించారు. మంత్రుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో పోలీసులు రబ్బర్​ బుల్లెట్లతో కాల్పులు జరపగా పలువురు మృతి చెందారు. ఈ క్రమంలో ఆందోళనలు తీవ్రతరం కావడంతో మంగళవారం ఉదయం నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియాపై బ్యాన్​ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో ప్రధాని శర్మ తన పదవిని కోల్పోయారు.

    Nepal PM Resigns | సైన్యం సూచనతో..

    ప్రధాని కేపీ శర్మ ఓలి(PM KP Sharma Oli) సైన్యం సూచనతో తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం నేపాల్​ కొత్త ప్రధాని(Nepal New PM)ని ప్రకటించే అవకాశం ఉంది. కాగా శర్మ దుబాయి వెళ్లడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.కాగా సోమవారం జరిగిన నిరసనల్లో 20 మంది మృతి చెందగా.. దాదాపు 250 మంది పౌరులు గాయపడ్డారు. ఈ విషయమై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని కేపీ శర్మ ఓలి ప్రకటించారు. అంతలోనే ఆయన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...