అక్షరటుడే, డిచ్పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీబీపూర్ తండా (Bibipur Thanda) వద్ద డిచ్పల్లి (Dichpally) వైపు వెళ్తున్న టిప్పర్ (Tipper) అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపక్కకు దూసుకుపోయింది.
అతివేగంగా సైడ్వాల్ను ఢీకొట్టడంతో అది ఓవైపు వంగిపోయాయి. దీంతో టిప్పర్లో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే స్థానికులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
National Highway | డ్రైవర్ల అతివేగమే కారణం..
జాతీయ రహదారిపై ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటికి డ్రైవర్ల అతివేగమే కారణమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.