అక్షరటుడు, నందిపేట్ : Nandipet | వెల్మల్(Velmal) గ్రామానికి బాడీ ఫ్రీజర్ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్(Mangiramulu Maharaj) ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ను దాతలు కస్ప రామకృష్ణ, లావణ్య, ఇసపల్లి నరేందర్ తదితరులు అందజేశారు.
గ్రామానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో బాడీ ఫ్రీజర్(Body Freezer)ను అందజేసినట్లు దాతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీధర్, వెన్నెల శేఖర్, తల్వెద రాము, ముప్పెడ నారాయణ, గోర్ల శ్రీను, మెడికల్ మల్లేశ్, కస్ప చిన్నయ్య, రామర్తి రాజేశ్వర్, చిన్నరామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.