ePaper
More
    HomeతెలంగాణHydra Police Station | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో హైడ్రా పోలీస్​ స్టేషన్​

    Hydra Police Station | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో హైడ్రా పోలీస్​ స్టేషన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydra Police Station | తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా(Hydra) ఏర్పాటుతో ఇప్పటికే చెరువులు, కుంటల్లోని ఆక్రమణలతో పాటు, రోడ్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం హైడ్రా పోలీస్​ స్టేషన్​(Hydra Police Station) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఇక ఈ ఠాణాలోనే ప్రజలు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. గతంలో ఇతర పోలీస్ స్టేషన్​లలో నమోదైన భూకబ్జా కేసులు.. ప్రస్తుతం హైడ్రా ఠాణాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

    Hydra Police Station | ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు

    హైడ్రా పోలీస్​ స్టేషన్​ ఎస్​హెచ్​వో(SHO)గా ఏసీపీ స్థాయి అధికారి ఉండనున్నట్లు సమాచారం. ఔటర్​ రింగ్​ రోడ్డు లోపలి ప్రాంతం అంతా దీని పరిధిలోని రానుంది. ఓఆర్​ఆర్(ORR)​ లోపల ఎక్కడ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా అయినా ఈ ఠాణాలోనే కేసులు నమోదు చేయనున్నారు. దీని విస్తిర్ణం 2,053 చదరపు కిలో మీటర్లు ఉండనున్నట్లు సమాచారం.

    Hydra Police Station | జాప్యాన్ని నివారించేందుకు..

    ప్రభుత్వ భూములు, కుంటలు, రోడ్లు, చెరువుల ఆక్రమణలపై కేసులను ప్రస్తుతం ఇతర పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. అయితే ఇతర కేసులతో బిజీగా ఉండే పోలీసులు(Police) వాటిపై త్వరగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఆ కేసుల దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు హైడ్రా పోలీస్​ స్టేషన్​(Hydra Police Station)ను ఏర్పాటు చేస్తున్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై ఈ ఠాణాలో ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం(పీడీపీపీ) కింద కేసులు నమోదు చేయాలని హైడ్రా యోచిస్తోంది.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...