ePaper
More
    HomeజాతీయంCP Radhakrishnan | విక‌సిత్ భార‌తే ల‌క్ష్యం.. ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్‌

    CP Radhakrishnan | విక‌సిత్ భార‌తే ల‌క్ష్యం.. ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CP Radhakrishnan | ఉప రాష్ట్రపతి ఎన్నిక (Vice President Election) ప్రారంభ‌మైంది. పార్లమెంటు న్యూ బిల్డింగ్‌లో మంగ‌ళ‌వారం ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలైంది. ఈ నేప‌థ్యంలో ఎన్డీయే అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటింగ్‌కు ముందు సీపీ రాధాకృష్ణన్ ఢిల్లీలోని లోథి రోడ్ ప్రాంతంలో గ‌ల‌ శ్రీరామ మందిర్‌ (Sri Rama Mandir)లో ప్రత్యేక పూజలు చేశారు.

    ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. ఎన్నికలు జరుగుతున్నాయని, భారత జాతీయవాదానికి ఇది పెద్ద విజయం కానుందన్నారు. విక‌సిత్ భార‌తే అంద‌రి అభిమ‌తం కావాల‌ని తెలిపారు.

    CP Radhakrishnan | మ‌న‌మంతా ఒక‌టే..

    ఎన్నిక‌ల్లో భారత జాతీయవాదం పెద్ద విజయం సాధించనుందని రాధాకృష్ణన్ అన్నారు. “ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది భారత జాతీయవాదానికి పెద్ద విజయం కానుంది. మనమందరం ఒక్కటే, మనమందరం ఒక్కటే అవుతాము. భారతదేశం ‘వికసిత్ భారత్’గా మారాలని మేము కోరుకుంటున్నాము…”, అని రాధాకృష్ణన్ (CP Radhakrishnan) వ్యాఖ్యానించారు.

    CP Radhakrishnan | ప్రారంభ‌మైన ఓటింగ్‌

    పార్ల‌మెంట్ న్యూ బిల్డింగ్‌లో ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ప్రారంభ‌మైంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) తొలి ఓటు వేశారు. జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ ఆరోగ్య కారణాలతో జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేయ‌డంతో ఈ ఎన్నిక అనివార్య‌మైంది. ఎన్డీయే త‌ర‌ఫున రాధాకృష్ణన్ బ‌రిలో ఉండ‌గా.. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జ‌స్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) పోటీలో ఉన్నారు. కీలకమైన ఎన్నిక‌కు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ప్రతిపక్ష పార్టీలు మాక్ పోల్స్ (Mock Polls) నిర్వహించాయి.

    CP Radhakrishnan | వ‌న్నె తెస్తార‌న్న ప్ర‌ధాని..

    మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రాధాకృష్ణన్‌ను అద్భుతమైన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రధాని మోదీ ప్రశంసించారు సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం దేశవ్యాప్తంగా అపారమైన ఉత్సాహాన్ని కలిగించిందని, అద్భుతమైన ఉపాధ్యక్షుడు అవుతారని ప్రజలు నమ్ముతున్నారని ప్రధాని పేర్కొన్నారు. “ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో రాధాకృష్ణ‌న్ పాల్గొన్నారు. ఎన్డీయే కుటుంబంలోని ఎంపీలు హాజరయ్యారు. తిరు సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం అంతటా అపారమైన ఉత్సాహాన్ని కలిగించింది. ఆయన తన జ్ఞానం, అంతర్దృష్టులతో కార్యాలయాన్ని సుసంపన్నం చేసే అద్భుతమైన ఉపాధ్యక్షుడు అవుతారని ప్రజలు నమ్ముతున్నారు” అని ఆయన ‘X’లో పోస్ట్ చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...