ePaper
More
    HomeతెలంగాణHigh Court | హైకోర్టు సంచ‌ల‌న తీర్పు.. గ్రూప్‌-1 ప‌రీక్ష‌లు మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ఆదేశం

    High Court | హైకోర్టు సంచ‌ల‌న తీర్పు.. గ్రూప్‌-1 ప‌రీక్ష‌లు మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ఆదేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | గ్రూప్‌-1 ప‌రీక్ష‌లపై తెలంగాణ హైకోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువరించింది. గ‌తంలో నిర్వ‌హించిన మెయిన్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన న్యాయ‌స్థానం.. మ‌ళ్లీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది.

    గ‌తంలో ప్ర‌క‌టించిన జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ జాబితాను ర‌ద్దు చేస్తూ జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు(Justice Namavarapu Rajeswara Rao) ఆదేశాలు జారీ చేశారు. రీ వాల్యుయేష‌న్ చేయాల‌ని ఆదేశించిన న్యాయ‌స్థానం.. వాటి ఆధారంగా ఫ‌ల‌తాలు వెల్ల‌డించాల‌ని సూచించింది. ఒక‌వేళ రీవాల్యుయేష‌న్ సాధ్యం కాక‌పోతే మ‌ళ్లీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని టీజీపీఎస్సీ(TGPSC)ని ఆదేశించింది. 8 నెల‌ల్లోపు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది.

    గ్రూప్‌-1 మూల్యాంకనం(Group-1 Evaluation)లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వులు అందుకునే దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇలా అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు(High Court) మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

    High Court | సుదీర్ఘ విచార‌ణ‌..

    గ్రూపు 1 పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కొందరు తమ వాదన వినిపించగా, రద్దు చేయవద్దంటూ మరికొందరు వేసిన పిటిషన్లపై జూలై 7న వాదనలు జరిగాయి. మరోవైపు, గ్రూప్‌-1 మెయిన్స్‌ సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు జరగలేదని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. అంతేకాక మెయిన్స్‌ పరీక్షను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని వివరించింది. ఇప్పటికే గ్రూప్‌-1 పరీక్షల(Group-1 Exams) ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కానీ, హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్‌ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా కోర్టు తీర్పుతో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...