ePaper
More
    HomeతెలంగాణSriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 8 గేట్ల ఎత్తివేత

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 8 గేట్ల ఎత్తివేత

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ (SRSP)కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

    ప్రాజెక్ట్​లోకి 54,545 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఎనిమిది వరద గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కులు గోదావరి (Godavari)లోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం అంతేమొత్తంలో నీరు నిల్వ ఉంది.

    Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల

    జలాశయం నుంచి 19 వేల క్యూసెక్కులు వరద కాలువ (Flood Canal)కు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 360 క్యూసెక్యుల నీటిని వదులుతున్నారు. అలీసాగర్ ఎత్తిపోతలకు 360, గుత్ప ఎత్తిపోతలకు 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం 54,545 క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదు అవుతోంది.

    శ్రీరామ్​ సాగర్​ మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం నిర్మించిన వరద కాలువ ద్వారా మిడ్​మానేరు (Mid Manair)కు నీటిని తరలిస్తున్నారు. ఇప్పటికే మిడ్​ మానేరు నిండుకుండలా మారాగా.. అక్కడి నుంచి లోయర్​ మానేరుకు నీటిని వదులుతున్నారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలతో మిడ్​మానేరు, లోయర్​ మానేరు డ్యాంలను నింపితే విద్యుత్​ బిల్లు రూ.కోట్లలో వచ్చేది. ఈ సీజన్​లో ఎస్సారెస్పీకి వరదలు భారీగా రావడంతో వరద కాలువ ద్వారా ఆ ప్రాజెక్ట్​లను అధికారులు నింపారు.

    Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి

    శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​ నుంచి గోదావరి, కాలువలకు నీటి విడుదల కొనసాగుతుండంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపర్లు, మత్స్యకారులు కాలువలు, నదిలోకి వెళ్లొద్దని ప్రాజెక్ట్​ ఏఈఈ కొత్త రవి సూచించారు. ఎగువ నుంచి వరద పెరిగితే గోదావరిలోకి నీటి విడుదలను పెంచుతామన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. ఏ మార్గంలోనంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...