అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bigg Boss 9 | బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 (Season 9) సెప్టెంబర్ 7 రాత్రి గ్రాండ్ లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ సారి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా కామనర్స్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం ప్రత్యేకత.
మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టగా వారిలో 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. అయితే అందరిలోనూ ఎక్కువగా సర్ప్రైజ్ చేసిన సింగర్ రాము రాథోడ్(Ramu Rtahod). రాము రాథోడ్ పేరు సోషల్ మీడియాలో పెద్దగా వినిపించకపోవడంతో అతడి ఎంట్రీ అందరికీ షాక్ ఇచ్చింది. ఎక్కడో పల్లెటూరి నుంచి ఎదిగి, యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన రాము బిగ్ బాస్ స్టేజ్ పై అడుగుపెట్టడం ఆడియన్స్‌కి స్పెషల్ ఫీలింగ్ ఇచ్చింది.
Bigg Boss 9 | స్పెషల్ జర్నీ..
తెలంగాణ(Telangana) రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా, భూత్పూర్ మండలం, గోపాలపూర్ తాండాలో జన్మించిన రాము చిన్నప్పటి నుంచే పాటలు, డాన్స్‌ల మీద ఆసక్తి చూపేవాడు. ఫ్యామిలీ ఫంక్షన్లు, స్కూల్ ఈవెంట్స్ అన్నీ అతడి టాలెంట్ ప్రదర్శించే వేదికలే. తరువాత తన ప్రతిభను పెద్ద స్థాయిలో చూపించాలన్న ఆలోచనతో యూట్యూబ్(You Tube)లోకి అడుగుపెట్టాడు. మొదట ఇతర పాటలకు డాన్స్‌లు చేస్తూ మొదలుపెట్టి, తరువాత తనే రాసి, పాడి, కంపోజ్ చేసిన “సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ అనే ఫోక్ సాంగ్‌ని యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. ఊహించని విధంగా ఆ పాట మిలియన్ల వ్యూస్ సాధించి రామును లైమ్‌లైట్‌లోకి తీసుకువచ్చింది.
అప్పటి నుంచి వరుసగా ఫోక్ సాంగ్స్(Folk Songs) విడుదల చేస్తూ జానపద సంగీతానికి ఆధునిక హంగులు జోడించి, డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఇటీవల విడుదల చేసిన రాను బొంబాయికి రాను పాటతో సోషల్ మీడియాలో రాముకు ఊహించని స్థాయి పాపులారిటీ వచ్చింది. ఈ పాట యూట్యూబ్‌లో 516 మిలియన్ల వ్యూస్(516 Million Views) దక్కించుకొని రికార్డు సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ అంతా ఈ పాటతో నిండిపోయాయి. సినిమా పాటలు కూడా రాని రేంజ్ వ్యూస్ ఈ ఫోక్ సాంగ్ సాధించడం విశేషం. తన సహజమైన శైలి, స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్‌తో రాము ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు, సినీ పరిశ్రమ కూడా అతడి క్రేజ్‌కి ఆకర్షితమైంది. తాజాగా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన “మజాకా” సినిమాలో, రాములమ్మ పాట రీమేక్ వెర్షన్‌గా వాడుకోవడం రాముకు లభించిన గుర్తింపుకు నిదర్శనం. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్(Big Boss House)లోకి అడుగుపెట్టిన రాము రాథోడ్, తన ఎంటర్టైనింగ్ నేచర్‌తో ప్రేక్షకులను అలరిస్తాడని అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.