ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​National Lok Adalat | 13న జాతీయ లోక్ అదాలత్

    National Lok Adalat | 13న జాతీయ లోక్ అదాలత్

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీపీ ఒక ప్రకటన విడుదల చేశారు.

    ఈనెల 13న జరిగే చాలామంది ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన తక్కువ ఖర్చుతో పరిష్కరించడానికి నిర్వహిస్తున్న లోక్ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    చిన్నచిన్న కేసులు, ట్రాఫిక్ చలాన్లు (Traffic challans), మైనర్ క్రిమినల్ కేసులు(Minor criminal cases), సివిల్ తగాదాలను లోక్​ అదాలత్​లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చన్నారు.

    అంతేకాకుండా లోక్​ అదాలత్​ అనేది ఒక శాంతియుత పరిష్కార విధానమని పేర్కొన్నారు. పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కోర్టు కేసుల్లో త్వరగా పరిష్కారం చేసుకుని అవకాశం దొరుకుతుందన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...