ePaper
More
    HomeతెలంగాణMilad Un Nabi | మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ర్యాలీలు

    Milad Un Nabi | మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ర్యాలీలు

    Published on

    అక్షరటుడే, బోధన్ : Milad Un Nabi | పట్టణంలో మిలాద్​ ఉన్​ నబీ(Milad Un Nabi) సందర్భంగా సోమవారం భారీ ర్యాలీ తీశారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా బోధన్ రజాయా ముస్తఫా కమిటీ(Razaya Mustafa Committee) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగించారు. మూడు రోజుల క్రితమే పండగ సందర్భంగా ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ర్యాలీని సోమవారం నిర్వహించారు.

    ఈ ర్యాలీ పట్టణంలోని రెంజల్(Renjal) బేస్​లో ఉన్న సయ్యద్ షా జలాల్ బుఖారి దర్గా నుండి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధులగుండా అంబేడ్కర్​ చౌరస్తాకు చేరుకుంది. అంబేడ్కర్​ చౌరాస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త గురించి, ఆయన చూపిన మార్గంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మోయిన్ రజా, అలీమ్ రజా, కలీం, బాకీ, హమీద్​తోపాటు ముస్లింపెద్దలు యువకులు పాల్గొన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకటనారాయణ, సిబ్బందితో కలిసి భద్రతను పర్యవేక్షించారు.

    Milad Un Nabi | బాన్సువాడలో..

    అక్షరటుడే, బాన్సువాడ : మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు (మిలాద్ ఉన్ నబీ) పురస్కరించుకొని పట్టణంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త చెప్పిన మానవత్వం, ప్రేమ, శాంతి, ఏకత్వం వంటి విషయాలను వివరించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు జులూస్​లో పాల్గొన్నారు. మసీదుల నుంచి ప్రత్యేకంగా బైక్​ర్యాలీ(Bike Rally) నిర్వహించారు. యువకులు మంచినీరు, డ్రింక్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌస్ పాషా, ఎజాజ్, వాహబ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...