ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | తెయూలో విద్యార్థుల ఆందోళన: హెల్త్​కేర్​ సెంటర్​లో ఔషధాలు ఉంచాలని డిమాండ్​

    Telangana University | తెయూలో విద్యార్థుల ఆందోళన: హెల్త్​కేర్​ సెంటర్​లో ఔషధాలు ఉంచాలని డిమాండ్​

    Published on

    అక్షరటుడే,డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హెల్త్​కేర్​ సెంటర్​ (Healthcare Center) ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు.

    సెంటర్​లో పూర్తిస్థాయిలో ఔషధాలను అందుబాటులో ఉంచాలని వర్సిటీ ఏబీవీపీ(ABVP) విద్యార్థి నాయకులు డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్​లర్, రిజిస్టార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    ఈ మేరకు యూనివర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉన్న ఈ యూనివర్సిటీలో కనీసం హెల్త్ సెంటర్ నిర్వహణ లేకపోవడం బాధాకరమని, సెంటర్​లో పూర్తిస్థాయి మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

    Telangana University | రెగ్యులర్​ వైద్యుడిని అందుబాటులో ఉంచాలి..

    24 గంటలపాటు రెగ్యులర్ డాక్టర్​ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. ఆందోళన విషయం తెలుసుకున్న రిజిస్టార్ యాదగిరి (TU Registrar Yadagiri) విద్యార్థి నాయకుల దగ్గరికి చేరుకొని వారితో చర్చించారు. పూర్తిస్థాయి వసతుల కల్పనకు వైస్ ఛాన్స్​లర్ యాదగిరి రావుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో వర్సిటీ ఏబీవీపీ విద్యార్థి నాయకులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    హెల్త్​కేర్​ సెంటర్​ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు

    More like this

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Cheques | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Cheques | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి (Ramchandrapalli Village) చెందిన మహిళకు...