ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Prashanth Reddy | చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

    Mla Prashanth Reddy | చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

    Published on

    అక్షరటుడే, కమ్మర్​పల్లి: Mla Prashanth Reddy | విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

    కమ్మర్​పల్లి (Kammarpally) మండలంలోని అమీర్​నగర్​లో (Amin nagar) వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ పాఠశాలల క్రీడాపోటీలను (Inter-school sports) సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భగా క్రీడాజ్యోతిని వెలిగించి.. క్రీడాకారుల నుంచి గౌరవ వందన స్వీకరించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. అలాగే క్రీడల్లోనూ రాణించినట్లయితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉందన్నారు. పోటీల సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural programs) ఆహుతులను ఆకట్టుకున్నాయి.

    టోర్నీలో మండల స్థాయిలో మొత్తం 12 ప్రభుత్వ, ప్రైవేట్​ పాఠశాలలు పాల్గొంటున్నాయి. పోటీలు 8,9,10 తేదీల్లో జరుగనున్నాయి. అలాగే అమీన్​నగర్​ వీడీసీ ఆధ్వర్యంలో క్రీడాకారులకు, అధికారులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కమ్మర్​పల్లి ఎంఈఓ ఆంధ్రయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెం చిన్నయ్య, పీడీ విద్యాసాగర్​ రెడ్డి, పవన్​, నాగభూషణం, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

    More like this

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....