అక్షరటుడే, ఎల్లారెడ్డి : BJP Yellareddy | కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై బీజేపీ నాయకులు ఎల్లారెడ్డి పట్టణంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్‌లో పీఎం మోడీ(PM Modi) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం బీజేపీ నాయకులు(BJP Leaders) మాట్లాడుతూ.. దేశంలో నిత్యావసర వస్తువులు, ఆటోమొబైల్ రంగంలో వస్తువులపై గణనీయంగా జీఎస్టీ తగ్గించడం అనేది సామాన్యులకు ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు. ప్రతిఒక్క భారతీయుడు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తూ వీటిపై ఉన్న జీఎస్టీ(GST)ని పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు.
నిత్యావసర వస్తువులపై12 శాతం ఉన్న జీఎస్టీని 5శాతానికి తగ్గించారని.. ఆటోమొబైల్ రంగం(Automobile Sector)లో 28శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతం తగ్గించారని వివరించారు. పేద ప్రజలపై వివిధ టాక్స్‌ల పేరుతో పట్టిపీడిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్రంలోని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను స్ఫూర్తిగా తీసుకుని నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, బత్తిని దేవేందర్, పట్టణ అధ్యక్షుడు అగల్ దివిటి, రాజేష్ మండల అధ్యక్షుడు పెద్దెడ్ల నర్సింలు, మాజీ పట్టణ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి శంకర్ ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్, పులి రమేష్, కార్యదర్శి మామిడి రమేశ్, కోశాధికారి గజానంద్, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ యువ నాయకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.