ePaper
More
    HomeసినిమాBigg Boss 9 | డ్ర‌గ్స్ కేసు.. మ‌రోవైపు ఐదు నెల‌ల పాప.. బిగ్ బాస్‌లో...

    Bigg Boss 9 | డ్ర‌గ్స్ కేసు.. మ‌రోవైపు ఐదు నెల‌ల పాప.. బిగ్ బాస్‌లో అడుగుపెట్టిన సంజ‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bigg Boss 9 | టాలీవుడ్‌లో ఒకే ఒక‌ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి సంజన గల్రానీ, ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(Big Boss Season 9)లో 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

    ఓటీటీలో కాకుండా మళ్లీ మెయిన్‌స్ట్రీమ్‌లోకి రావాలని తలంచిన సంజన, బిగ్ బాస్ వేదికగా తన జీవితం గురించి నిజాలు బయట పెట్టేందుకు సిద్ధమైంది. సంజన గల్రానీ(Sanjana Galrani), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా న‌టించి తెలుగు ప్రేక్షకులకు అల‌రించింది. ఆ తరువాత తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించింది. వరుస అవకాశాలతో కెరీర్ ఊపందుకున్న సమయంలోనే ఒక అనూహ్య కేసు ఆమె జీవితాన్ని కలవరపరిచింది.

    Bigg Boss 9 | రిస్క్ చేసి మ‌రి..

    బిగ్ బాస్ స్టేజిపై తన అనుభవాలను షేర్ చేస్తూ సంజన భావోద్వేగానికి గురయ్యింది. ఒక చిన్న ఎంక్వైరీ అంటూ పిలిచి, తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, అసలు వాస్తవం తెలియకుండానే మీడియా కథనాలు హడావుడి చేశాయని,ఆ సమయంలో తన జీవితమే ముగిసిపోయిందనిపించిందని కన్నీళ్లు పెట్టుకుంది.అయితే, హైకోర్టు తనకు క్లీన్ చీట్ ఇచ్చిందని స్పష్టం చేసింది. కానీ ఆ విషయం జనానికి తెలియకుండా పోయిందని బాధపడింది. ఇక కోవిడ్ సమయంలో తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.ఆ తర్వాత కొడుకు జన్మించాడని, ఈ ఏడాది తనకు ఒక పాప పుట్టిందని చెప్పింది. ప్రస్తుతం ఐదు నెలల పాపను తన భర్త వద్ద వదిలి, బిగ్ బాస్ షో(Big Boss Show)లో పాల్గొనడానికి వచ్చానని వెల్లడించింది.

    తనపై పడిన నిందలను తొలగించుకునేందుకు, తన నిజమైన స్వభావాన్ని ప్రపంచానికి చూపించేందుకు బిగ్ బాస్‌ ప్లాట్‌ఫాం ఎంపిక చేసుకున్నాన‌ని సంజన పేర్కొంది. ఇది నాకు రిస్టార్ట్ చేసే అవకాశం. నేను ఎవరిని, నా ప్రయాణం ఏంటి అన్నదాన్ని ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నా” అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పింది. సంజన చెప్పిన మాటలు చూసిన ప్రేక్షకులు ఆమె నిస్సహాయతను, నిజాయితీని గుర్తించి మద్దతుగా నిలుస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఎలా ఉంటుంది? మరిన్ని అనుభవాలను ఎలా పంచుకుంటుంది? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగుతోంది.

    More like this

    Kajal Aggarwal | యాక్సిడెంట్ వార్త‌ల‌పై స్పందించిన కాజ‌ల్.. అదంతా తప్పుడు ప్ర‌చార‌మ‌న్న హీరోయిన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kajal Aggarwal | సెలబ్రిటీల గురించి చాలాసార్లు పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా నటి...

    Farmers | రైతులకు గుడ్​న్యూస్​.. ధాన్యం కొనుగోళ్లు ఎప్పటి నుంచంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmers | వానాకాలం (Kharif) సీజన్​లో సాగు అవుతున్న ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు...

    AP High Court | హైకోర్ట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాలు, టికెట్ల వ్య‌వ‌హారం.. సీఎం, మంత్రులు సినిమాల్లో నటించొచ్చా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP High Court | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు, టికెట్...