ePaper
More
    HomeజాతీయంTaj Mahal | వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న తాజ్‌మ‌హల్‌.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌

    Taj Mahal | వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న తాజ్‌మ‌హల్‌.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Taj Mahal | ప్ర‌పంచంలోనే ప్ర‌త్యేక గుర్తింపు తాజ్ మ‌హాల్ వ‌ద‌ర‌ల్లో చిక్కుకుంది. భారీ వ‌ర్షాల‌తో యమునా న‌ది ఉప్పొంగుతోంది. ఎన్న‌డూ క‌నీవినీ ఎరుగ‌ని వ‌రద‌లు ఆగ్రాలోని తాజ్‌మ‌హాల్‌ను చుట్టుముట్టాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నాలలో ఒకటైన తాజ్‌మ‌హల్‌ (Taj Mahal)ను ఆనుకుని వ‌ర‌ద ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తోంది. యమునా నదిలో నీటి మట్టం పెరుగుతూనే ఉండటంతో తాజ్ మహల్ చుట్టుపక్కల ప్రాంతాలను, సమీపంలోని ఘాట్‌లపై నుంచి వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. 2023లో కూడా య‌మునా నది ఈ స్థాయిలోనే ఉప్పొంగింద‌ని, అయితే, ఇలాంటి పరిస్థితులను తట్టుకునేలా నిర్మించిన తాజ్ మహల్‌కు ఎటువంటి హాని జరుగలేదని చరిత్రకారుడు రాజ్ కిషోర్ రాజే(Historian Raj Kishore Raje) తెలిపారు.

    Taj Mahal | ప‌ర్యాట‌కుల నిలిపివేత‌..

    వ‌ర‌ద‌ల కార‌ణంగా నీటిమ‌ట్టం త‌గ్గే వ‌ర‌కూ ఆగ్రాలో ప‌ర్యాట‌కుల‌పై ఆంక్ష‌లు విధించారు. దీంతో సంద‌ర్శ‌కుల సంఖ్య త‌గ్గిపోయింది. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాలతో (Heavy Rains) యుమ‌నా న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఇది తాజ్‌మ‌హల్ వ‌ద్ద ఉన్న ఘాట్ల‌ను ముంచెత్త‌డ‌మే కాకుండా, నది ఒడ్డున ఉన్న అనేక ఇళ్లను కూడా ముంచెత్తింది. ప్ర‌మాద హెచ్చ‌రిక‌గా భావించే 205.33 మీట‌ర్లకు మించి వ‌ర‌ద ఉప్పొంగుతుండ‌డం అధికారుల‌ను కల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ప్రాణ న‌ష్టం జరుగ‌కుండా అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. దసరా ఘాట్, యమునా కారిడార్ సమీపంలోని నది ఒడ్డున ఉన్న అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

    Taj Mahal | కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

    వరద (Heavy Flood) ముప్పును ఎదుర్కోవడానికి ఆగ్రా జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. యమునా నది ఇప్పటికీ 205.33 మీటర్ల స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 206 మీటర్ల మార్కును దాటితే ఆయా ప్రాంతాల‌ను ఖాళీ చేయించాల‌ని భావిస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...