ePaper
More
    Homeభక్తిTirumala | శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

    Tirumala | శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారి ఆలయం (Srivari Temple)లో సోమవారం ఉదయం దర్శనాలు ప్రారంభం అయ్యాయి. చంద్రగ్రహణం (Lunar eclipse) నేపథ్యంలో ఆలయాన్ని మూసి వేసిన విషయం తెలిసిందే.

    చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9.50 నుంచి 1.31 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉండటంతో.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం 3.30 గంట‌ల‌కు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

    Tirumala | అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ..

    చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంట‌లకు మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సు (Annaprasadam Complex)ను మూసివేశారు. సోమవారం ఉదయం 7.30 గంట‌లకు దానిని తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం ఉదయం 8.30 గంట‌ల నుంచి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది.

    Tirumala | యాదగిరిగుట్టలో సైతం

    గ్రహణం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను మూసివేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం అన్ని ఆలయాలను తెరిచి శుద్ధి చేశారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన ద్వారాలను సైతం అర్చకులు తెరిచారు. ఆలయం, మాడ వీధుల్లో శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. 

    More like this

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం.. నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరి సామాన్యుల‌కి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...