ePaper
More
    HomeFeaturesFarmer | కూరగాయలు సాగు చేస్తూ బిడ్డను డాక్టర్​ చేసిన రైతు.. అభినందించిన ఏసీపీ

    Farmer | కూరగాయలు సాగు చేస్తూ బిడ్డను డాక్టర్​ చేసిన రైతు.. అభినందించిన ఏసీపీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmer | ప్రస్తుతం చాలా మంది అన్ని ఉన్నా.. ఏదో లేదని చెప్పి బాధ పడుతూ ఉంటారు. కానీ ఆ రైతు మాత్రం రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు (Higher education) చదివించాడు.

    హన్మకొండ (Hanmakonda) జిల్లా కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన రాజు కూరగాయలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తనకున్న పొలంతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. పంట భూమి పక్కనే రోడ్డుపై తాను పండించిన కూరగాయాలు విక్రయించి లాభాలు పొందుతున్నాడు. దీంతో మార్కెటింగ్​కు ఇబ్బందులు లేకుండాపోయాయి. ఆయనను కాజీపేట ఏసీపీ ప్రశాంత్​రెడ్డి (Kazipet ACP Prashanth Reddy) అభినందించారు.

    Farmer | అటుగా వెళ్తూ..

    కాజేపీట ఏసీపీ విధి నిర్వహణలో భాగంగా అటుగా వెళ్తు రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న రైతును చూసి ఆగారు. రైతు రాజుతో కొద్దిసేపు మాట్లాడారు. రాజు కృషిని ఆయన అభినందించారు. రాజు తన కూతురు ఎంబీబీఎస్​ (MBBS) పూర్తి చేసి నీట్​ పీజీ కోసం ప్రిపేర్​ అవుతోందని, కొడుకు బీటెక్ (B.Tech)​ ఫైనల్ ఇయర్​ చదువుతున్నాడని చెప్పారు. దీంతో ఏసీపీ సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడి బిడ్డలను ఉన్నత చదువులు చదివించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇన్​స్టాగ్రామ్​లో రాజుతో మాట్లాడిన వీడియోను షేర్​ చేశారు. ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇలా రైతులను సపోర్ట్​ చేసే అధికారులు ఉండాలని నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు.

    Farmer | మనుసు నిండిపోయింది

    ‘‘విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న క్రమంలో ఒక అపురూప దృశ్యం కనిపించింది. ఒక రైతు కుటుంబం తమకున్న ఒక చిన్న కమతంలో కూరగాయల సాగు చేస్తూ, దారిన వెళ్లేవారికి తాజా కూరగాయల్ని చవకగా అమ్ముతున్నారు. ఆ రైతు సోదరుడితో కాసేపు ముచ్చటిస్తే మనసు నిండిపోయింది. ఇద్దరు పిల్లల్లో కూతురిని డాక్టర్, కొడుకుని ఇంజినీర్​ను చేస్తూ, నిజాయితీతో కష్టాన్నే నమ్ముకునే నీ కుటుంబానికి నా జోహార్లు రాజు’’ అంటూ ఏసీపీ పోస్ట్​ చేశారు.

     

    View this post on Instagram

     

    A post shared by PRASHANTH REDDY PINGILI (@kazipetacp)

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...