అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gift nifty | యూఎస్(US), యూరోప్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) సైతం పాజిటివ్‌గా ఉంది.
Gift nifty | యూఎస్ మార్కెట్లు..
ఆర్థిక అనిశ్చితులు, ఈ వారంలో ఇన్ఫ్లేషన్ డాటా(Inflation data) రిలీజ్ కానుండడంతో గత ట్రేడింగ్ సెషన్‌లో వాల్‌స్ట్రీట్ (Wallstreet) ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.
లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఎస్‌అండ్‌పీ 0.32 శాతం, నాస్‌డాక్ 0.03 శాతం నష్టపోయాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.08 శాతం లాభంతో సాగుతోంది.
Gift nifty | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్ 0.73 శాతం, సీఏసీ 0.31 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.09 శాతం నష్టంతో ముగిశాయి.
Gift nifty | ఆసియా మార్కెట్లు..
ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ జీడీపీ(Japan GDP) గత త్రైమాసికంతో పోల్చితే 0.5 శాతం పెరగడం, ఆ దేశ పీఎం రాజీనామా వంటి పరిణామాలతో అక్కడి మార్కెట్లు ఉత్సాహంగా ఉన్నాయి.
ఉదయం 8 గంటల సమయంలో నిక్(Nikkei)కీ 1.42 శాతం లాభంతో ఉంది. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.49 శాతం, హాంగ్‌సెంగ్ 0.26 శాతం, కోస్పీ 0.11 శాతం, షాంఘై 0.03 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.02 శాతం లాభంతో ఉన్నాయి.
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో కొనసాగుతుండడంతో నూతన వారాన్ని మన మార్కెట్లు సైతం ఆశావాహ దృక్పథంతో ప్రారంభించే అవకాశాలున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.22 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈ రోజు గ్యాప్ అప్(Gap up)లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Gift nifty | గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు వరుసగా పదోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 1,304 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. డీఐఐ(DII)లు తొమ్మిదో రోజూ నికరంగా రూ. 3,176 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.84 నుంచి 0.86 కు పెరిగింది. విక్స్(VIX) 0.67 శాతం తగ్గి 10.78 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.21 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడి 88.26 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.10 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 97.84 వద్ద కొనసాగుతున్నాయి.
- ఈవారంలో భారత్(Bharath), యూఎస్‌లకు సంబంధించిన ఇన్ఫ్లేషన్ డాటా రానుంది. ఈ డాటా ఆధారంగా ఆయా దేశాలు వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశాలున్నాయి.
- యూఎస్ సుంకాలపై అనిశ్చితి కొనసాగుతుండడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలకు అడ్డుకట్ట పడకపోవడంతో మార్కెట్లు స్పష్టమైన దిశను తీసుకోలేకపోతున్నాయి.
- అమెరికా, భారత్ సంబంధాల గురించి ఆందోళన చెందడం లేదని, ఇరు దేశాల మధ్య ప్రత్యేక సంబంధం ఉందని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్(Trump) పేర్కొన్నారు. మోదీని గొప్ప ప్రధానమంత్రిగా పొగడడం, ఆయనతో ఎల్లప్పుడూ తాను స్నేహంగా ఉంటానన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అనిశ్చిత పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న ఆశాభావాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఇది మన మార్కెట్లకు మంచి పరిణామంగా నిలుస్తుందని భావిస్తున్నారు.