ePaper
More
    HomeసినిమాMS Dhoni | యాక్ట‌ర్‌గా మారిన క్రికెట‌ర్ ధోనీ.. వైర‌ల్‌గా మారిన 'ది చేజ్' టీజ‌ర్

    MS Dhoni | యాక్ట‌ర్‌గా మారిన క్రికెట‌ర్ ధోనీ.. వైర‌ల్‌గా మారిన ‘ది చేజ్’ టీజ‌ర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MS Dhoni | క్రికెట్‌లో త‌న బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించిన భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఇప్పుడు వెండతెర‌పై మెరుపులు మెరిపించేందుకు సిద్ధ‌మవుతున్న‌ట్లు కనిపిస్తోంది. మిస్ట‌ర్ కూల్ మాధ‌వ‌న్‌తో క‌లిసి చేసిన ఫైటింగ్ సీన్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో (Social Media) వైర‌ల్‌గా మారింది.

    జిగ్రా సినిమా దర్శకుడు వాసన్ బాలా ఆదివారం ది చేజ్ టీజర్‌ను (The Chase Teaser) సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేప‌థ్యంలో ధోనీ సినీ ఫీల్డ్‌లోకి ఎంట్రీపై ప్ర‌చారం జోరందుకుంది. వాస‌న్ షేర్ చేసిన టీజర్‌లో.. హీరో ఆర్‌.మాధవన్, మహేంద్ర సింగ్ ధోని స్పెష‌ల్ మిషన్‌కు వెళ్లే యోధుల పాత్రల్లో కనిపించారు. వారు శత్రువులతో పోరాడుతున్నట్లు చూపించారు. అయితే, ఈ టీజర్ సినిమాకి చెందినదా లేదా ఏదైనా బ్రాండ్ ప్ర‌మోష‌న్‌కు సంబంధించిన యాడ్‌కు చెందినదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

    MS Dhoni | ఒక మిషన్, ఇద్దరు యోధులు

    ఈ వీడియోలో ధోని, మాధవన్ ఇద్దరూ టాస్క్‌ఫోర్స్ అధికారుల లుక్‌లో కనిపిస్తారు. ‘ఇద్దరు యోధులు, ఒక మిషన్’ అనే ట్యాగ్‌లైన్‌తో వారిని చూపించారు. యూనిఫాం ధరించిన ఇద్దరు స్టార్ల ఎంట్రీ అభిమానులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. మాధవన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేసి, ‘ఒక మిషన్. ఇద్దరు యోధులు. సిద్ధంగా ఉండండి, ఒక అద్భుతమైన ఛేజ్ ప్రారంభం కానుంది’ అని రాయ‌డంతో ధోనీ సినీ ఎంట్రీపై స‌స్పెన్స్ మ‌రింత ఎక్కువైంది.

    MS Dhoni | నెట్టింట హ‌ల్‌చ‌ల్‌

    మాధవన్ ఈ టీజర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. వందలాది మంది అభిమానులు (Fans) వీడియోను షేర్ చేయడం ప్రారంభించారు. ధోనీ సినీ రంగప్రవేశం గురించి జోరుగా చర్చ జ‌రుగుతోంది. ధోని ఇప్పటికే చాలా ప్రకటనలలో న‌టించాడు. అలాగే, ఇటీవల తమిళ చిత్రం ‘గోట్’లో అతిథి పాత్రలు చేశాడు. అయితే, ఈసారి అతని గ్లింప్స్ పూర్తిగా భిన్నంగా, శక్తివంతంగా కనిపిస్తోంది. అయితే, అది ఒక ప్రకటన అయినా ఒక సినిమాను ప్రకటించేలా షేర్ చేయబడింది. ‘మహి చివరకు తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడా?’ అని వాసన్ పోస్ట్ కింద నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు.

    More like this

    Chris Gayle | పంజాబ్ ఫ్రాంఛైజీ నన్ను చిన్నపిల్లాడిలా ట్రీట్ చేసింది.. కుంబ్లే ముందు ఏడ్చాను : క్రిస్​ గేల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chris Gayle | వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్, యూనివర్సల్ బాస్‌గా పేరొందిన క్రిస్ గేల్...

    School Games | క్రీడల్లో జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలి

    అక్షరటుడే, ఇందూరు: School Games | క్రీడల్లో జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలని డీఈవో అశోక్ (DEO Ashok)...

    National Lok Adalat | 13న జాతీయ లోక్ అదాలత్

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని నిజామాబాద్ పోలీస్...