అక్షరటుడే, బోధన్ :Bodhan | పట్టణంలోని బసవతారక్ నగర్లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం(Contact Program)ను నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 35 లిక్కర్ బాటిళ్లను(Liquor bottles) స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ(CI Venkatanarayana) తెలిపారు. సరైన పత్రాలు చూపిస్తే వాహనాలను రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై హబీబ్ ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.