ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | గణేశ్​ ఉత్సవాలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు : సీపీ సాయి...

    CP Sai Chaitanya | గణేశ్​ ఉత్సవాలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు : సీపీ సాయి చైతన్య

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్​ పరిధిలో గణేశ్​ ఉత్సవాలకు సహకరించిన ప్రజలకు సీపీ సాయి చైతన్య కృతజ్ఞతలు తెలిపారు. వినాయక నిమజ్జనం (Ganesh Immersion) ముగిసిన అనంతరం ఆయన ప్రకటన విడుదల చేశారు.

    జిల్లాలో వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జన ఉత్సవాల వరకు ప్రజలు సహకరించారన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకున్నారని పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలో దాదాపు ఆరు వేల విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు ఆయన తెలిపారు.

    గణేశ్​ నిమజ్జనం సదర్భంగా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. బాసర, ఉమ్మెడతో పాటు మిగతా ప్రాంతాల్లో సైతం నిమజ్జన కోసం పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. నగరంలో సార్వజనిక్​ గణేశ్​ మండలి, గణేశ్​ మండపాల నిర్వాహకుల సహకారంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉన్న ఆయా శాఖల అధికారులను ఆయన అభినందించారు.

    More like this

    TVS NTORQ 150 లాంచింగ్​.. ఫస్ట్​ హైపర్ స్పోర్ట్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత్​లో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ TVS NTORQ 150 ని టీవీఎస్...

    BJP Yellareddy | నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గించడం భేష్​.. బీజేపీ నాయకులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : BJP Yellareddy | కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై బీజేపీ...

    GPO | కొత్త జీపీఓలకు కౌన్సెలింగ్

    అక్షరటుడే, ఇందూరు: GPO | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామపంచాయతీ అధికారుల (Gram Panchayat Officers) నియామకాలు చేపట్టింది....