అక్షరటుడే, కోటగిరి: Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ట్రాన్స్‌కో ఆపరేషన్స్(Transco Operations) డీఈ ఎండీ ముక్తార్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్థ(Electricity department) అభివృద్ధిలో భాగంగా కొత్తపల్లి సబ్‌స్టేషన్ కోటగిరి సెక్షన్, రుద్రూర్ (Rudrur) సబ్ డివిజన్లలో నూతన వీసీబీలను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గృహ వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే క్రమంలో నూతన వీసీపీలను ప్రారంభించామన్నారు. రూ.3 లక్షలతో ఈ పరికరాలను అమర్చామని ఆయన తెలిపారు. కొత్తపల్లి (Kothapally) గ్రామ వినియోగదారులకు, అగ్రికల్చర్ ఫీడర్‌కు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉంటుందని ఆయన వివరించారు.
ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ ఐఏఎస్ వరుణ్ రెడ్డి(NPDCL Chairman IAS Varun Reddy) ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎండీ ముక్తార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.. వినియోగదారులకు సరైన సేవలందించడాన్ని బాధ్యతగా భావించాలని కోరారు.
అలాగే రైతుల ఎక్కడ కూడా సొంతంగా విద్యుత్ పనులు చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ రుద్రూర్ తోట రాజశేఖర్, కోటగిరి ఏఈ బుజ్జిబాబు, విద్యుత్ సిబ్బంది ప్రేమ్ దాస్, వెంకటేశం, రాజు గౌడ్, రవి వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.