ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Prashanth Reddy | గుత్ప, చౌట్​​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను ప్రారంభించాలి

    Mla Prashanth Reddy | గుత్ప, చౌట్​​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను ప్రారంభించాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | గుత్ప (Guthpa), చౌట్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్ట్​లను (Choutpally Hanmanth Reddy Lift) వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇరిగేషన్​ అధికారులకు సూచించారు.

    వేల్పూర్​లోని (Velpur) ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయనను కుకునూర్ గ్రామభివృద్ధి కమిటీ, నవాబ్ లిఫ్ట్ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు. లిఫ్ట్ ప్రారంభించి చెరువులు నింపేందుకు అడ్డుగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు.

    దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ సీఈ మధుసూదన్, ఈఈ భాను ప్రకాష్​లతో ఫోన్​లో మాట్లాడారు. సీజన్ ప్రారభించకముందే మోటార్లు, ట్రాన్స్​ఫార్మర్లు సిద్ధంగా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులాదేనన్నారు. వెంటనే ట్రాన్స్​ఫార్మర్లను తెప్పించి నవాబ్ లిఫ్ట్ ప్రారంభించాలని, కుకునూర్ లిఫ్ట్​లో మోటార్లు ఇసుకలో కూరుకుపోయాయని వాటిని సైతం తీయించి పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

    ఎస్సారెస్పీ ప్రాజెక్ట్​లో 45 టీఎంసీలు ఉన్నప్పుడే చెరువులు నింపి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని ఇప్పుడు వందలాది టీఎంసీలు సముద్రం పాలయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో పూర్తిస్థాయిలో నీళ్లు ఉన్నందున వెంటనే గుత్ప, చౌట్​పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్​లు ప్రారభించాలని సూచించారు. మెయింటెనెన్స్​ లేక వెంగంటి లిఫ్ట్ సంబంధించిన కాపర్ కాయిల్స్, ఇతర లిఫ్ట్ సామగ్రి ఎత్తుకుపోయారని వాటిని రీస్టోర్ చేసి పల్లికొండ లిఫ్ట్ కుడా ప్రారంభించాలని డిమాండ్​ చేశారు.

    More like this

    Ganesh immersion | ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh immersion | పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముసిగింది. 11 రోజులుగా...

    MP Arvind | బీజేపీలో బీఆర్​ఎస్​ విలీనంపై ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | బీజేపీలో బీఆర్​ఎస్​ను విలీనం చేయాలని చూశారని గతంలో వార్తలు వచ్చిన...

    Stock Market | లాభాల బాటలో మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) నూతన వారాన్ని ఆశావహ...