ePaper
More
    HomeతెలంగాణAttack on police vehicle | పోలీసు వాహనంపై రాళ్లతో దాడి.. అద్దాలు ధ్వంసం

    Attack on police vehicle | పోలీసు వాహనంపై రాళ్లతో దాడి.. అద్దాలు ధ్వంసం

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్ : Attack on police vehicle | వినాయక నిమజ్జన (Ganesh Immersion) శోభాయాత్రలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల వాహనంపై కొందరు యువకులు దాడి చేశారు.

    ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్​ మండలం బడా భీమ్​గల్​ గ్రామంలో చోటుచేసుకుంది. జిల్లాలో వినాయక నిమజ్జనం శనివారం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

    బడా భీమ్​గల్​ గ్రామంలో శనివారం నిమజ్జన శోభాయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో బందోబస్తు చేపట్టడానికి పోలీసులు వచ్చారు. కాగా, వారి వాహనంపై ఆకతాయిలు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు.

    Attack on police vehicle | త్వరగా వెళ్లమని చెప్పడంతో..

    గ్రామంలో శనివారం మొదలైన వినాయకుడి శోభాయాత్ర ఆదివారం తెల్లవారుజామున వరకు కొనసాగింది. దీంతో మండపాల నిర్వాహకులను పోలీసులు మందలించారు. వెంటనే వెళ్లిపోవాలని సూచించారు.

    దీంతో కొందరు యువకులు వాహనం police vehicle వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు వాహనం వెనుక అద్దం పగిలిపోయింది.

    దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులకు, యువకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.

    ఈ విషయమై ఎస్సై సందీప్​ (SI Sandeep)ను వివరణ కోరగా.. రాళ్లతో దాడి చేసి పోలీసు​ వాహనాన్ని ధ్వంసం చేశారని చెప్పారు.

    తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడి చేసిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

    More like this

    Chris Gayle | పంజాబ్ ఫ్రాంఛైజీ నన్ను చిన్నపిల్లాడిలా ట్రీట్ చేసింది.. కుంబ్లే ముందు ఏడ్చాను : క్రిస్​ గేల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chris Gayle | వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్, యూనివర్సల్ బాస్‌గా పేరొందిన క్రిస్ గేల్...

    School Games | క్రీడల్లో జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలి

    అక్షరటుడే, ఇందూరు: School Games | క్రీడల్లో జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలని డీఈవో అశోక్ (DEO Ashok)...

    National Lok Adalat | 13న జాతీయ లోక్ అదాలత్

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని నిజామాబాద్ పోలీస్...