ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Teachers Day | దేగాంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

    Teachers Day | దేగాంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: Teachers Day | మండలంలోని దేగాం ఉన్నత పాఠశాలలో (Degam High School) ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

    ఈ సందర్భంగా విద్యా కమిటీ (Education Committee) సభ్యులు మాట్లాడుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను గ్రామంలోని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలన్నారు.

    సభకు అధ్యక్షత వహించిన హెచ్​ఎం బున్ని రాజేందర్ (HM Bunni Rajender) మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని, చక్కగా చదువుకొని, జీవిత లక్ష్యాలను సాధించే దిశలో ముందుకు వెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తేవాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్​ఎం బున్ని రాజేందర్, విద్యా కమిటీ సభ్యులు సుదర్శన్, రమేశ్, ఉపాధ్యాయులు ఇందుమతి, రాజ్ నారాయణ, శ్రీధర్, సుమతి, నరేందర్, శ్రీనివాస్, నాగమణి విద్యార్థులు పాల్గొన్నారు.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...