అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | ఐడీవోసీలోని పలు శాఖలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయాలను సందర్శించి పనితీరును సమీక్షించారు.
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) జరిగిన పంట నష్టం వివరాలకు సంబంధించిన నివేదికలను పరిశీలించారు. బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా పక్కా వివరాలు పొందుపర్చాలన్నారు. వరదల కారణంగా సిరికొండ, ధర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయి, వేల్పూర్, వర్ని మండలాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేసిందని వివరించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇసుక మాటలను ఈజీఎస్ కూలీలతో తొలగింప జేయాలని ఆదేశించారు. హౌసింగ్ శాఖలు తనిఖీ చేసిన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరగా పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులు ఆదేశించారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఈఈ నివర్తి ఉన్నారు.
Collector Nizamabad | నగరపాలక సంస్థ కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. కార్పోరేషన్లోని వివిధ విభాగాల పనితీరు గురించి కమిషనర్ దిలీప్ కుమార్తో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.