అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో (Police Headquarters) ఏర్పాటు చేసిన శ్రీ ఓం గణేశ్ మండలి వద్ద శనివారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమం అనంతరం వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. 1300 మందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని.. డ్రోన్ కెమెరాలు (Drone cameras).. కమాండ్ కంట్రోల్ రూం (Command Control Room) నుంచి నిఘా పెట్టామన్నారు.
కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి (Baswa reddy), నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి (Raja Venkat reddy), ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Masthan Ali), రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీష్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.