అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shreyas Iyer | ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కించుకోని భారత వెటరన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక బాధ్యతలు అప్పగించింది. త్వరలో భారత్-ఏ జట్టు తరఫున ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగబోయే అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
ఐపీఎల్ 2024, ఐపీఎల్ 2025లో మంచి ఫామ్‌ను కనబర్చినప్పటికీ, శ్రేయస్‌ను ఆసియా కప్ 2025(Asia Cup 2025) జట్టులో ఎంపిక చేయలేదు. శుభ్‌మన్ గిల్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణంగా చెబుతుండగా, ఇది సెలెక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నాహకంగా భావిస్తున్న ఆసియా కప్‌కి శ్రేయస్‌ను పక్కన పెట్టడాన్ని అభిమానులు, మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.
Shreyas Iyer | భారత్-ఏ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
ఇందుకు పరిష్కారంగా , బీసీసీఐ శ్రేయస్‌కు భారత్-ఏ జట్టులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ధ్రువ్ జురేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్ పర్యటనలో భాగంగా రెండు అనధికారిక టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు లక్నో (ఏక్‌నా స్టేడియం) మరియు కాన్పూర్ వేదికలపై జరగనున్నాయి. మొదటి టెస్ట్: సెప్టెంబర్ 16–19, లక్నో, రెండో టెస్ట్: సెప్టెంబర్ 23–26, లక్నోలో జరగనున్నాయి వన్డేల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్ ఆటగాళ్లు రెండో టెస్ట్‌లో భాగం కానున్నారు. ఆసియా కప్‌కు ఎంపిక కాని శ్రేయస్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2025లో వెస్ట్ జోన్ తరఫున ఆడుతున్నాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో 28 బంతుల్లో 25 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు, రుతురాజ్ గైక్వాడ్ 184 పరుగులతో ఆకట్టుకోగా, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
శ్రేయస్‌కు భారత్-ఏ సారథ్య బాధ్యతలు అప్పగించడాన్ని కొందరు తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం గా చూస్తున్నారు. అయితే కొందరు క్రికెట్ విశ్లేషకులు, మాజీలు మాత్రం ఈ నిర్ణయాన్ని శ్రేయస్ ఫామ్‌ను తిరిగి పొందేందుకు అవకాశంగా భావిస్తున్నారు. ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోయినా, శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) కెప్టెన్‌గా పునరాగమనం చెయ్యడం అతని కెరీర్‌కు మళ్లీ ఊపు తీసుకురాగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్-ఏ జట్టుతో చేసే ప్రదర్శన ద్వారా ఆయన తిరిగి టీమిండియా(Team India) ప్రధాన జట్టులోకి ఎంట్రీ ఇస్తారా? అనే ఆసక్తికర ప్రశ్నకు సమాధానం కొన్ని వారాల్లో రానుంది.
Shreyas Iyer | ఆస్ట్రేలియా ఏతో మల్టీ-డే మ్యాచ్‌ల కోసం భారత ఏ జట్టు…
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బడోని, నితీష్ రెడ్డి, ప్రస్న్‌దుష్ క్రిష్ణమేద్, గుర్నేల్ బి క్రిష్ణమేద్, గుర్నీదుష్ కోటియాన్ , మానవ్ సుతార్, యష్ ఠాకూర్