ePaper
More
    Homeబిజినెస్​Sampre Nutritions Ltd | రెండున్నర నెలలుగా అప్పర్‌ సర్క్యూట్‌.. రూ. లక్షను రూ. 3.75...

    Sampre Nutritions Ltd | రెండున్నర నెలలుగా అప్పర్‌ సర్క్యూట్‌.. రూ. లక్షను రూ. 3.75 లక్షలు చేసిన స్టాక్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sampre Nutritions Ltd | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) ఏడాది కాలంగా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతోంది. కానీ ఓ స్టాక్‌ మాత్రం జూన్‌ 11వ తేదీనుంచి పైపైకి వెళ్తూనే ఉంది. తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సెన్సెక్స్‌(Sensex) ఈ రెండున్నర నెలల కాలంలో 2.2 శాతం, నిఫ్టీ 1.6 శాతం వరకు నెగెటివ్‌ రిటర్న్స్‌ ఇవ్వగా.. ఆ స్టాక్‌ మాత్రం ఏకంగా 275 శాతం పెరగడం గమనార్హం. ఆ స్టాక్‌ గురించి తెలుసుకుందామా..

    సంప్రే న్యూట్రిషన్స్‌ లిమిటెడ్‌(Sampre Nutritions Ltd) కంపెనీ న్యూట్రాష్యూటికల్స్‌, ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేస్తుంది. ఆయా ప్రొడక్ట్స్‌ కోసం ఇటీవల టోలరామ్‌ వెల్‌నెస్‌ లిమిటెడ్‌తో ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో వార్షిక ప్రాతిపదికన రూ. 10 కోట్ల బిజినెస్‌ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మూడేళ్ల వ్యవధిలో రూ. 30 కోట్ల వరకు వ్యాపారం ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ కంపెనీ షేరు విలువ పెరగడం ప్రారంభించింది. ఇది పెన్నీ స్టాక్‌ కావడం, భారీ ఆర్డర్‌ ఉండడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎగబడి కొంటున్నారు. దీంతో రోజూ అప్పర్‌ సర్క్యూట్‌ కొడుతూ పైపైకి వెళ్తోంది.

    జూన్‌ 11నుంచి..

    ఈ ఏడాది జూన్‌ 11న సంప్రే న్యూట్రిషన్స్‌ లిమిటెడ్‌లో అప్‌ట్రెండ్‌ ప్రారంభమైంది. అప్పటినుంచి ఒక్క సెషన్‌లో కూడా ఈ స్టాక్‌ నష్టాన్ని చూడలేదు. జూన్‌ 11న ఈ షేరు ధర రూ. 23.06 ఉండగా.. సెప్టెంబర్‌ 5న రూ. 86.67 వద్ద స్థిరపడిరది. జూన్‌ 11న ఈ కంపెనీ షేర్లలో రూ. లక్ష ఇన్వెస్ట్‌ చేసినవారి సంపద ఇప్పుడు రూ. 3.75 లక్షలు అయ్యిందన్న మాట.

    పతనమూ ఇదే స్థాయిలో..

    ఈ కంపెనీ షేర్లు రెండున్నర నెలలుగా ఏ విధంగానైతే పెరుగుతున్నాయో.. గతంలో పతనమూ అదే స్థాయిలో జరిగింది. గతేడాది సెప్టెంబర్‌ 6వ తేదీన ఒక్కో ఈక్విటీ షేరు(Share) ధర రూ. 80 ఉండగా.. నవంబర్‌ 8న రూ. 101.17 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఆ తర్వాత ఈ స్టాక్‌లో పతనం ప్రారంభమైంది. మార్చి 27న రూ. 20.90 కు పడిపోయి 52 వారాల కనిష్టాన్ని(52 weeks low) నమోదు చేసింది. స్టాక్‌ మార్కెట్‌ రిస్క్‌తో కూడుకున్నది. పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

    More like this

    Silver Ring | బొటనవేలికి వెండి ఉంగరం ధరించారా.. లక్ష్మీదేవి వచ్చినట్టే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Silver Ring | ప్రతి ఒక్కరి జీవితంలో ఉంగరాలు ధరించడం ఒక సాధారణ ఆచారం. మనం...

    GST Reforms | వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. ప్రముఖ కార్లపై భారీగా తగ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | వాహన కొనుగోలుదారులకు శుభవార్త. ప్రముఖ సంస్థల కార్ల ధరలు భారీగా...

    Kamareddy Floods | వరదల ఎఫెక్ట్​.. మరో మృతదేహం లభ్యం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Floods | జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) తీవ్ర...