అక్షరటుడే, కామారెడ్డి : Ganesh Immersion | పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మండపంలోని గణపతిని ట్రాక్టర్ పైకి క్రేన్ ద్వారా ఎక్కిస్తుండగా గణనాథ విగ్రహం(Ganesha Idol) కిందపడి కొద్దిమేర డ్యామేజ్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ(Indiranagar Colony)లో ఇందిరానగర్ యువజన 55వ వార్షికోత్సవం సందర్భంగా 18 ఫీట్ల గణపతిని ఏర్పాటు చేశారు. శుక్రవారం 9 గంటల ప్రాంతంలో మండపం నుంచి క్రేన్ ద్వారా గణేషుడిని ట్రాక్టర్లో ఎక్కిస్తున్నారు.
ఈ క్రమంలో గణేశుని విగ్రహం ఒక్కసారిగా కిందపడిపోగా కుడివైపు చేయి విరిగింది. అలాగే వెనుకవైపు డిజైన్ డ్యామేజ్ అయింది. ఈ ఘటనలో యువసేన(Yuvasena)కు చెందిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి కాళ్లు విరగగా.. మరొకరి కుడి చేయికి, వెన్నుపూసకు తీవ్ర గాయలైనట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్రేన్ డ్రైవర్ పరారీలో ఉండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.