అక్షరటుడే, బోధన్ : Ganesh Immersion | బోధన్ పట్టణంలో వినాయక శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ శివాలయం నుండి వినాయక నిమజ్జన శోభాయాత్రను సబ్ కలెక్టర్ వికాస్ మహతో(Sub Collector Vikas Mahato) ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. బోధన్ ఏపీసీ శ్రీనివాస్(Bodhan APC Srinivas) యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Ganesh Immersion | యాత్ర రూట్ ఇదే..
పట్టణంలోని బోధన్ శివాలయం(Bodhan Shivalayam) నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పాత బోధన్ మీదుగా గ్రామ చౌడి, పెద్ద మసీద్ పోస్టాఫీస్ మీదుగా పాత బస్టాండ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి రాకాసీపేట్ మీదుగా పట్టణ శివారులోని పసుపు వాగులో వినాయక విగ్రహాలను నిమజ్జనం(Ganesh చేయనున్నారు. ఈ నిమజ్జనాలు ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగునున్నాయి.
Ganesh Immersion | 100 మంది సిబ్బందితో బందోబస్తు..
ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, వంద మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక డ్రోన్ కెమెరా ఆసాంతం నిమజ్జన యాత్రను కవర్ చేస్తోంది. అలాగే 50 సీసీ కెమెరాలతో పక్కా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ యాత్రను పట్టణ సీఐ వెంకట్ నారాయణ(CI Venkat Narayana) ఆధ్వర్యంలో బృందం పర్యవేక్షిస్తోంది. సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో తమ్ముసేట్ రూ.51వేయికి లడ్డూను కైవసం చేసుకున్నాడు.