అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గణపతి నిమజ్జనం (Ganpati immersion) కోసం ట్రాలీ ట్రాక్టర్‌ను తీసుకెళ్తుండగా లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జాతీయ రహదారిపై (Kamareddy National Highway) క్యాసంపల్లి శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. దోమకొండకు (Domakonda) చెందిన యువకులు రామారెడ్డి నుంచి గణపతి ట్రాలీని (Ganpati trolley) తీసుకుని వెళ్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్‌పై నలుగురు యువకులు కూర్చున్నారు. ట్రాలీ బైపాస్ రోడ్డుపై క్యాసంపల్లి శివారులోకి రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని లారీ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజన్‌పై కూర్చున్న నలుగురికి గాయాలయ్యాయి. దోమకొండకు చెందిన సాయికుమార్, శ్రీధర్‌లతో పాటు ట్రాక్టర్ నడుపుతున్న రాజయ్యకు గాయాలయ్యాయి. ఇందులో శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ రిఫర్ చేశారు. మరొక యువకుని సైతం నిజామాబాద్‌కు రిఫర్ చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.