ePaper
More
    Homeఅంతర్జాతీయంUS President Trump | భార‌త్‌తో సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు సిద్ధం.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌..

    US President Trump | భార‌త్‌తో సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు సిద్ధం.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: US President Trump | వాణిజ్య యుద్ధంతో భార‌త్‌, అమెరికా మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్న త‌రుణంలో అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌తో ద‌శాబ్దాలుగా ప్ర‌త్యేక సంబంధాలు ఉన్నాయ‌న్న ట్రంప్‌.. వాటిని పున‌రుద్ధరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త‌న‌కు మంచి స్నేహితుడు, గొప్ప ప్ర‌ధాని అని, అయితే, ఆయ‌న చేస్తున్న ప‌నులు త‌న‌కు న‌చ్చ‌డం లేద‌న్నారు. “ప్ర‌ధాని మోదీ (PM Modi) మంచి స్నేహితుడు. మేము స్నేహితులుగా ఉంటాం. ఇందులో ఆందోళన చెందడానికి ఏమీ లేదు” అని నొక్కి చెప్పారు. భారీ పన్నుల నేపథ్యంలో భారత్ – అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్‌ను చైనాకు కోల్పోయామంటూ ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్టు ట్రంప్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

    US President Trump | 50 శాతం ప‌న్నులు ఎక్కువే..

    భార‌త్‌తో ద‌శాబ్దాలుగా మంచి మైత్రి ఉంద‌ని ట్రంప్ (US President Trump) గుర్తు చేశారు. అయితే, ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తుండ‌డ‌మే త‌మ‌కు న‌చ్చ‌లేద‌ని, అందుకే 50 శాతం టారిఫ్ విధించిన‌ట్లు చెప్పారు. అది పెద్ద మొత్త‌మేన‌ని ఆయ‌న అంగీక‌రించారు. ‘ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న తీరు నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో వారు చమురు కొనుగోలు చేస్తున్నారు. వారు వెనక్కి తగ్గకపోవడంతోనే భారత దిగుమతులపై భారీ పన్నులు విధించా. భారత్‌పై (India) విధించిన 50 శాతం పన్నులు చాలా ఎక్కువగానే ఉన్నాయి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి కూడా ట్రంప్ మాట్లాడారు.

    US President Trump | మోదీ మంచి ప్ర‌ధాని కానీ..

    ప్ర‌ధాని మోదీతో త‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని ట్రంప్ తెలిపారు. అత‌ను గొప్ప ప్ర‌ధాని అని, అయితే, ఆయ‌న చేసే ప‌నులు న‌చ్చ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ‘మోదీ గొప్ప ప్రధాని. ఆయనతో నాకు వ్యక్తిగతంగా మంచి అనుబంధముంది. కానీ, ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్-అమెరికా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితమే మోదీ అమెరికాలో (America) పర్యటించారు. మేమిద్దరం రోజ్ గార్డెన్‌లో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాం’ అని ట్రంప్ గుర్తు చేశారు.

    US President Trump | సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు సిద్ధం

    రెండు దేశాల మ‌ధ్య దెబ్బ‌తిన్న సంబంధాలు పున‌రుద్ధ‌రించ‌డానికి సిద్ధ‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు తెలిపారు. “ఈ సమయంలో భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?” అని విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా తన‌దైన శైలిలో స్పందించారు. “నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను ఎల్లప్పుడూ (ప్రధాని) మోదీతో స్నేహంగా ఉంటాను. ఆయన గొప్ప ప్రధాన మంత్రి. మేము ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటాం, కానీ ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. కానీ భారతదేశం, అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. చింతించాల్సిన అవసరం లేదు. మనకు సందర్భానుసారంగా నిర్ణ‌యాలు ఉంటాయి” అని అన్నారు.

    US President Trump | చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి…

    భారతదేశంతో పాటు ఇత‌ర దేశాల‌తో వాణిజ్య చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. వాణిజ్య చర్చల పురోగతిపై మీడియా అడిగి ప్రశ్నకు సమాధానమిస్తూ.. చర్చలు బాగా జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, యూరోపియన్ యూనియన్ ఇటీవల గూగుల్‌పై విధించిన జరిమానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “వారు చాలా బాగా చేస్తున్నారు. ఇతర దేశాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. కేవలం గూగుల్​తోనే కాకుండా పెద్ద దేశాలన్నింటితోనూ జరుగుతున్న దాని పట్ల యూరోపియన్ యూనియన్​పై మేము అసంతృప్తిగా ఉన్నాము” అని ట్రంప్ చెప్పారు. అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్​పై 3.5 బిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించినందుకు ‘ట్రూత్’లో వరుస పోస్ట్​ల ద్వారా ట్రంప్ EUని తీవ్రంగా విమర్శించారు.

    More like this

    Nizamabad City | నగరంలో ఒకరి దారుణ హత్య

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | నగరంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వన్ టౌన్...

    CP Sai Chaitanya | పోలీస్ గణేష్ మండలి వద్ద సీపీ ప్రత్యేకపూజలు

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో (Police Headquarters) ఏర్పాటు...

    Shreyas Iyer | శ్రేయస్ అయ్య‌ర్‌కి ప్ర‌మోష‌న్.. ఆస్ట్రేలియా సిరీస్‌కి కెప్టెన్‌గా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shreyas Iyer | ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కించుకోని భారత వెటరన్...