అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India Jersey | టీమిండియా అభిమానులకు శుభవార్త! టీమ్ ఇండియా అధికారిక కిట్ స్పాన్సర్ అయిన అడిడాస్ సంస్థ(Adidas Company), జాతీయ జెర్సీలపై ఏకంగా 80% వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
టీమిండియా అభిమానులు ఇప్పుడు చాలా తక్కువ ధరకు తమ అభిమాన జట్టు జెర్సీలను సొంతం చేసుకునే అరుదైన అవకాశం పొందారు. అయితే ఇంత భారీ డిస్కౌంట్ వెనుక అసలు కారణం ఏమిటంటే.. అడిడాస్ ఇప్పుడు తగ్గింపుతో విక్రయిస్తున్న జెర్సీలపై డ్రీమ్11(Dream 11) లోగో ఉన్నది. గతంలో డ్రీమ్11 టీమ్ ఇండియా(Team India)కు లీడ్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. కానీ భారత్‌లో రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లపై కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో బీసీసీఐ (BCCI)తో డ్రీమ్11 ఒప్పందం ముగిసింది. ఫలితంగా ఆ లోగో ఉన్న జెర్సీలను ఇప్పుడు క్లియరెన్స్ డీల్స్‌లో అమ్ముతున్నారు.
ఏయే జెర్సీలపై డిస్కౌంట్ ఉంది?
- అడిడాస్ అధికారిక వెబ్‌సైట్లో ఇప్పుడు ఈ క్రింది జెర్సీలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి:
- FW24 టీ20 ఇంటర్నేషనల్ జెర్సీ (పురుషులది) – ₹5,999 నుంచి → ₹1,199
- FW24 టీ20 ఇంటర్నేషనల్ జెర్సీ (మహిళలది) – 80% తగ్గింపు
- ఫ్యాన్ ఎడిషన్ టీ20 జెర్సీ – 70% తగ్గింపు
- ప్రాక్టీస్ జెర్సీలు (పిల్లలది) – 80% తగ్గింపు
- ట్రై కలర్ జెర్సీలు (2 & 3 స్టార్స్ వేరియంట్స్) – 80% తగ్గింపు
- టెస్ట్ మ్యాచ్ మహిళల జెర్సీ – 80% తగ్గింపు
- 2025 వన్ డే రిప్లికా జెర్సీ (పిల్లలది) – 80% తగ్గింపు
- అసలు ధర – డిస్కౌంట్ ధర
ఉదాహరణకు, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు టీ20ల్లో ఉపయోగిస్తున్న FW24 జెర్సీ అసలు ధర రూ.5,999 కాగా, ఇప్పుడు అదే జెర్సీ కేవలం రూ.1,199 కు లభిస్తోంది. ఈ డిస్కౌంట్లు అడిడాస్ అధికారిక వెబ్‌సైట్ లో లభిస్తున్నాయి. పరిమిత స్టాక్ మాత్రమే అందుబాటులో ఉన్నందున, ఆసక్తి ఉన్నవారు వెంటనే ఆర్డర్ చేయడం ఉత్తమం. ఈ ఆఫర్ కేవలం జెర్సీలు మాత్రమే కాకుండా, ఇండియా క్రికెట్ ట్రైనింగ్ గేర్, ఫ్యాన్ ఎడిషన్ వేర్, పిల్లల వేరియంట్లు, మహిళల ఎడిషన్లు తదితరాలపై కూడా వర్తిస్తుంది. టీమిండియా అభిమానులు తమ వార్డ్రోబ్‌ను ఇప్పుడు గౌరవప్రదంగా, తక్కువ ఖర్చుతో దక్కించుకునే అవకాశం. స్టాక్ అయిపోకముందే, మీ జెర్సీ బుక్ చేసుకోండి . వెబ్‌సైట్: adidas.co.in