ePaper
More
    HomeసినిమాSIIMA Awards | దుబాయ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా సైమా వేడుక‌.. పుష్క‌2, క‌ల్కి చిత్రాల‌దే హ‌వా

    SIIMA Awards | దుబాయ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా సైమా వేడుక‌.. పుష్క‌2, క‌ల్కి చిత్రాల‌దే హ‌వా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: SIIMA Awards | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 వేడుకలు దుబాయ్‌(Dubai)లో అట్టహాసంగా సాగుతున్నాయి. దక్షిణాది భాషల్లో నటన, సాంకేతిక విభాగాల్లో అత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన వారికి అవార్డులు అంద‌జేస్తున్నారు.

    ఈ కార్యక్రమంలో తొలి రోజు తెలుగు, కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖులు అవార్డులు అందుకున్నారు. 2024లో విడుదలైన చిత్రాల ఆధారంగా అవార్డులు ప్రకటించగా, తెలుగు సినిమా విభాగంలో ‘పుష్ప 2’ అత్యధికంగా నాలుగు అవార్డులు సొంతం చేసుకుంది. 13వ ఎడిష‌న్‌లో భాగంగా జ‌రుగుతున్న ఈ వేడుక‌లో అల్లు అర్జున్ ,రష్మిక మందన, మీనాక్షి చౌదరి, శ్రీయ,అల్లు శిరీష్, సందీప్ కిషన్, పాయల్ రాజపుత్‌ తదితరులు సందడి చేశారు.

    అవార్డుల జాబితా చూస్తే..

    తెలుగు విభాగంలో అవార్డుల వివరాలు:

    • ఉత్తమ చిత్రం: కల్కి 2898 A.D
    • ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
    • ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2)
    • ఉత్తమ నటి: రష్మిక మందన్న (పుష్ప 2)
    • ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)
    • ఉత్తమ ప్రతినాయకుడు (విలన్): కమల్ హాసన్ (కల్కి 2898 A.D)
    • ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి (దేవర సినిమా – “చుట్టమల్లే” పాటకు)
    • బెస్ట్ క‌మెడియ‌న్‌: స‌త్య (మ‌త్తు వ‌ద‌ల‌రా 2)
    • ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ: ర‌త్నవేలు (దేవ‌ర‌)
    • ఉత్త‌మ గాయ‌ని: శిల్పారావ్ (దేవ‌ర‌-చుట్ట‌మ‌ల్లే)
    • ఉత్తమ ప‌రిచ‌య న‌టి: భాగ్య శ్రీ బోర్సే ( మిస్టర్ బ‌చ్చ‌న్)
    • ఉత్త‌మ నూత‌న నిర్మాత‌: నిహారిక కొణిదెల ( క‌మిటీ కుర్రోళ్లు)
    • ఉత్త‌మ న‌టుడు (క్రిటిక్స్) : తేజ స‌జ్జా( హ‌నుమాన్)
    • ఉత్త‌మ న‌టి ( క్రిటిక్స్) : మీనాక్షి చౌద‌రి ( ల‌క్కీ భాస్క‌ర్)
    • ఉత్త‌మ ద‌ర్శ‌కుడు ( క్రిటిక్స్ ) : ప్ర‌శాంత్ వ‌ర్మ ( హనుమాన్)
    • ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా: అశ్వినీద‌త్ ( వైజ‌యంతీ మూవీస్)

    ఈ ఏడాది సైమా 13వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవం సినీ ప్రేమికుల కోసమే కాదు, దక్షిణాది సినీ పరిశ్రమ(Film Industry) ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణులు అందరి ప్రశంసలు అందుకున్నారు. మిగిలిన భాషల్లో (తమిళ, మలయాళ) అవార్డులు నేబు ప్రకటించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలు, హైలైట్స్ కోసం మీరు #SIIMA2025 అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వొచ్చు.

    More like this

    Sampre Nutritions Ltd | రెండున్నర నెలలుగా అప్పర్‌ సర్క్యూట్‌.. రూ. లక్షను రూ. 3.75 లక్షలు చేసిన స్టాక్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sampre Nutritions Ltd | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) ఏడాది కాలంగా...

    Kamareddy | ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ: నలుగురికి తీవ్ర గాయాలు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గణపతి నిమజ్జనం(Ganesha immersion) కోసం ట్రాలీ ట్రాక్టర్​ను (Trolley tractor) తీసుకెళ్తుండగా లారీ...

    Hyderabad | డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు.. రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ కేంద్రంగా డ్రగ్స్​ తయారు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​...