అక్షరటుడే, వెబ్‌డెస్క్: national highway accident : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిజామాబాద్ Nizamabad జిల్లా ముప్కాల్ మండలం శ్రీరామ్ సాగర్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
national highway accident : గుర్తుతెలియని వాహనం..
ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై నిర్మల్ Nirmal వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు.
national highway accident : ఇద్దరికి గాయాలు..
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మృతుడి వివరాలు, ఇతర పూర్తి సమాచారం information తెలియాల్సి ఉంది.