ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBetting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు సంపాదనకు అలవాటు పడుతున్న పలువురు యువకులు ఆన్​లైన్​ బెట్టింగ్ యాప్​లపై ఫోకస్ చేస్తున్నారు.

    లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. తీరా అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

    తాజాగా ఆన్​లైన్​ online బెట్టింగ్ యాప్​లో గేమ్​ ఆడి అప్పుల పాలై వాటిని తీర్చే దారి లేక జీవితంపై నమ్మకం సడలి ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఈ ఘటన కామారెడ్డి జిల్లా Kamareddy district బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో శుక్రవారం (సెప్టెంబరు 5) చోటుచేసుకుంది.

    స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మాందాపూర్ గ్రామానికి చెందిన లక్కబత్తిని సందీప్ కుమార్ (33) ఆన్​లైన్​లో బెట్టింగ్ ఆడుతూ అప్పులపాలయ్యాడు.

    Betting app case : బంగారు ఆభరణాలు విక్రయించి..

    ఆ అప్పులు తీర్చటానికి తన భార్య బంగారు ఆభరణాలు gold ornaments విక్రయించి, కొంత మేర అప్పులు చెల్లించాడు. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు.

    వాటిని తీర్చే మార్గంలేక మనస్తాపం చెందిన సందీప్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

    సందీప్​నకు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...

    KTR comments | బాన్సువాడలో పోచారం ఓడిపోతారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR comments | పాలన చేతకాని కాంగ్రెస్..​ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్​ఎస్ (BRS)​...