అక్షర టుడే, ఇందల్వాయి: MLA Bhupathi Reddy | మండలంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా గూపన్‌పల్లి బైపాస్‌రోడ్డు పక్కన ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి (office next to the Goopanpally bypass road,) చేతులమీదుగా నిజామాబాద్ రూరల్ మండలాల లబ్ధిదారులు సుమారు 200 మందికి చెక్కులు అందజేశారు. వీరిలో ఇందల్వాయి మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సంతోష్ రెడ్డి, గంగాధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.