ePaper
More
    HomeతెలంగాణTelangana Jagruthi | కవితకు క్షమాపణలు చెప్పకపోతే దాడులు చేస్తాం.. జాగృతి నాయకుల హెచ్చరిక

    Telangana Jagruthi | కవితకు క్షమాపణలు చెప్పకపోతే దాడులు చేస్తాం.. జాగృతి నాయకుల హెచ్చరిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Jagruthi | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha)పై కార్పొరేషన్​ మాజీ ఛైర్మన్లు రాజీవ్​సాగర్​, మఠం భిక్షపతి చేసిన వ్యాఖ్యలను జాగృతి నాయకులు ఖండించారు. తెలంగాణ జాగృతి నేతలు సోమాజిగూడ (Somajiguda) ప్రెస్​క్లబ్​లో మాట్లాడారు.

    రాజీవ్ సాగర్, మఠం భిక్షపతి కవితపై చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని జాగృతి నాయకులు అన్నారు. కవితతోనే వారు కార్పొరేషన్​ ఛైర్మన్లు అయ్యారని గుర్తు చేశారు. వారు ఇద్దరు తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులకు సైతం దిగుతామని వారు హెచ్చరించారు.

    Telangana Jagruthi | వారి వెనుక హరీశ్​రావు

    రాజీవ్ సాగర్, మఠం భిక్షపతిల మాటల వెనుక మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao) ఉన్నారని జాగృతి నాయకులు ఆరోపించారు. తీన్మార్ మల్లన్న కవితపై వ్యాఖ్యలు చేస్తే వీరు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి తమది అంటున్న రాజీవ్ సాగర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చిన ఆయన ఈ రోజు కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలు చేశారు.

    జాగృతి కార్యకర్తలు కవితను కలుస్తామంటే కలవనీయకుండా రాజీవ్ సాగర్ అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్​ ఇప్పించడానికి సైతం కవిత ప్రయత్నించారన్నారు. కానీ రాజీవ్​సాగర్​ నేడు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

    కేసీఆర్​ కోసమే తాము జాగృతి కోసం పనిచేశామని రాజీవ్​సాగర్​ గురువారం పేర్కొన్న విషయం తెలిసిందే. 19 ఏళ్ల పాటు తమను అన్ని రకాలుగా వినియోగించుకొని.. ఇప్పుడు రోడ్డున పడేశారని ఆయన కవితపై ఆరోపణలు చేశారు. కవిత లేఖ బయటకు వచ్చిన నాటి నుంచి తాము జాగృతికి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. బీఆర్​ఎస్​ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి నాయకులం తాము అన్నారు. ఈ క్రమంలో జాగృతి నాయకులు ఆయనపై మండిపడ్డారు.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...