అక్షరటుడే, ఇందూరు: DEO Ashok | జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ జూమ్ యాప్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు గణితాన్ని (mathematics) బోధించడం ఆదర్శనీయమని శ్రీకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఈవో అశోక్‌ను (DEO Ashok) సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య పట్ల అంకితభావం విలువలకు నిదర్శనం అని అన్నారు. ఉపాధ్యాయులు డీఈఓను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు బాలకృష్ణ, నరోత్తం, శ్యామ్, రాజేశ్వర్ గుప్తా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.