అక్షరటుడే, బాన్సువాడ : BRS | బాన్సువాడ (Banswada) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు శుక్రవారం గులాబీ గూటికి చేరారు.
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
BRS | పార్టీ బలోపేతానికి కృషి
కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై ప్రజలు విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచేలా చేరికలు ఉపకరించనున్నాయని తెలిపారు. కొత్తగా చేరిన నాయకులు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సురేందర్, షిండే, మాజీ ఎంపీ నామ నాగేశ్వర్ రావు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్, అంజిరెడ్డి, ఎర్రవట్టి సాయిబాబా, బోడ చందర్, మొచ్చి గణేష్, రమేష్ యాదవ్, గాండ్ల కృష్ణ, మొగులయ్య, శివ సూరి పాల్గొన్నారు.
BRS | స్థానిక ఎన్నికల వేళ
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జరగనున్నాయి. ఈ క్రమంలో బాన్సువాడ నియోజకవర్గంలో పలువురు నేతల అధికార పార్టీని వీడటం విస్మయానికి గురి చేస్తోంది. కాంగ్రెస్లో చేరిన వారిలో బాన్సువాడ మాజీ జెడ్పీటీసీ నార్ల రత్నకుమార్, ఎలమంచిలి శ్రీనివాస్, కోటగిరి మాజీ ఎంపీపీ వి శ్రీనివాస్, మాజీ సర్పంచులు పద్మ మొగులయ్య, బంజ గంగారాం, కుర్లెపు నగేష్, మాజీ ఎంపీటీసీలు చొక్క వీరయ్య, శ్రీహరి, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ గజేందర్ తదితరలు ఉన్నారు. వీరితో పాటు సుమారు 100 మంది కార్యకర్తలు గులాబీ కండూవా కప్పుకున్నారు.