ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Wine shops |మద్యం ప్రియులకు అలర్ట్​​.. రేపు వైన్సులు బంద్​

    Wine shops |మద్యం ప్రియులకు అలర్ట్​​.. రేపు వైన్సులు బంద్​

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Wine shops | జిల్లాలో మద్యం షాపులను శనివారం మూసి ఉంచాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

    కమిషనరేట్​ పరిధిలో కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్​ షాప్​లు, బార్లు, క్లబ్బులు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో గణేష్​ నిమజ్జన శోభాయాత్ర (Ganesh Nimajjanam) జరుగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుందని.. దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

    Wine shops | 6వ తేదీ ఉదయం నుంచి.

    నిజామాబాద్​ నగరంతో (Nizamabad City) పాటు ఆయా ప్రాంతాల్లో గణేష్​ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నందున 6వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని ఆయన పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంతంగా జరుపుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. దీంట్లో భాగంగానే మద్యం దుకాణాలను మూసి ఉంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

    More like this

    Cherlapalli Drugs Case | కూలీగా చేరి డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు చేసిన కానిస్టేబుల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Cherlapalli | హైదరాబాద్​ నగరంలో మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) ఇటీవల భారీ డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు...

    Stellant Securities India Ltd | ఐదేళ్లలో లక్షను కోటి చేసిన స్టాక్.. ఈ ఏడాది మే 16 నుంచి నాన్‌ స్టాప్‌ పరుగులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stellant Securities India Ltd | స్టెల్లంట్‌ సెక్యూరిటీస్‌ ఇండియా లిమిటెడ్‌(Stellant Securities India...

    Encounter | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | జమ్మూ కశ్మీర్​లో సోమవారం తెల్లవారుజామున ఎన్​ కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ...