- Advertisement -
Homeక్రీడలుShikhar Dhawan | ప్రియురాలిని పరిచయం చేసిన శిఖర్ ధావన్!

Shikhar Dhawan | ప్రియురాలిని పరిచయం చేసిన శిఖర్ ధావన్!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Shikhar Dhawan : టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ప్రియురాలు సోఫీ షైన్‌ను పరిచయం చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆమెతో దిగిన ఫొటోను శిఖర్ ధావన్ పంచుకున్నాడు. ఆ ఫొటోకు ‘మై లవ్’అంటూ లవ్ సింబల్ ఎమోజీని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

శిఖర్ ధావన్ తన మాజీ సతీమణి ఆయేషా ముఖర్జీ‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన కంటే 10 ఏళ్లు పెద్దదైనా ఆయేషాను కూడా ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు సహజీవనం చేసిన ఈ జోడీ.. 2012లో పెళ్లితో ఒక్కటైంది. అప్పటికే ఆయేషా ముఖర్జీకి పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2013 డిసెంబర్‌లో ఈ జోడీ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అతని పేరు జొరావర్. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ జోడీ తమ 12 ఏళ్ల వివాహ బంధానికి గుడ్‌బై చెప్పింది. తన కొడుకు జొరావర్‌ను ఆయేషా కుటుంబం కలవనిస్తలేదని ధావన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

- Advertisement -

ఆయేషా ముఖర్జీతో విడాకుల అనంతరం శిఖర్ ధావన్ ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు ఈ ఇద్దరూ హాజరు కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. తాజాగా శిఖర్ ధావన్ తమ ప్రేమయాణాన్ని అధికారికంగా ప్రకటించాడు.

 

- Advertisement -
- Advertisement -
Must Read
Related News