ePaper
More
    HomeజాతీయంEncounter | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఒక మావోయిస్టు మృతి

    Encounter | ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఒక మావోయిస్టు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఆపరేషన్​​ కగార్ (Operation Kagar)​ చేపట్టిన విషయం తెలిపిందే.

    ఆపరేషన్​ కగార్​లో భాగంగా వేలాది సంఖ్యలో భద్రతా బలగాలు (Security Forces) అడవులను జల్లెడ పడుతున్నాయి. నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోకి సైతం బలగాలు చొచ్చుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వరుస ఎన్​కౌంటర్లు చేసుకుంటుండగా.. చాలా మంది మావోయిస్టులు మృతి చెందారు.

    Encounter | నారాయణపూర్​ సరిహద్దులో..

    ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మృతి చెందాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నారాయణ్‌పూర్, దంతెవాడ నుంచి జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), రాష్ట్ర పోలీసు దళంలోని రెండు విభాగాలైన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త బృందం అంతర్ జిల్లా సరిహద్దులో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమలో బయలుదేరినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీస్​ అధికారులు తెలిపారు.

    ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్తలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటన స్థలంలో పోలీసుల కూంబింగ్​ ఇంకా కొనసాగుతోంది.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...