అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ODI Cricket | క్రికెట్ చరిత్రలో పరుగుల వర్షం కురిపించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అయితే, కొంతమంది బ్యాటర్లకి మాత్రం ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది .వారెప్పుడూ “డక్” అంటే సున్నా పరుగుల వద్ద అవుట్ కాలేదు. ఇది ఆశ్చర్యం కలిగించకమానదు.
ప్రత్యేకంగా ఈ జాబితాలో ఒక భారత క్రికెటర్(Indian Cricketer) పేరు ఉండటం గర్వకారణం. ఎప్పుడూ డకౌట్ కాని భారత బ్యాటర్ మరెవరో కాదు లెజెండరీ క్రికెటర్ యశ్పాల్ శర్మ(Yashpal Sharma). టీమిండియాకి సేవలందించిన ఈ దిగ్గజం తన వన్డే కెరీర్లో ఒక్కసారి కూడా సున్నా వద్ద అవుట్ కాలేదు. అతను 42 వన్డేలు ఆడి 883 పరుగులు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు 89 పరుగులు.
80ల కాలంలో వెస్టిండీస్,ఆస్ట్రేలియా , సౌతాఫ్రికా జట్లకి చెందిన బౌలర్స్ ప్రమాదకర బౌలింగ్ తో ఎలా హడలెత్తించేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సమయంలోనూ డకౌట్(Duck Out) కాకుండా నిలకడగా బ్యాటింగ్ చేయడం నిజంగా అభినందనీయం.
ఈ అరుదైన ఘనత సాధించిన ఇతర అంతర్జాతీయ బ్యాటర్లు ఎవరనేది చూస్తే:
1. పీటర్ కిర్‌స్టన్ (దక్షిణాఫ్రికా)
- మ్యాచులు: 40
- పరుగులు: 1293
- హాఫ్ సెంచరీలు: 9
- అత్యధిక స్కోరు: 97
- నాటౌట్ ఇన్నింగ్స్: 6
డకౌట్ లేదు.
3 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికా తరపున క్రికెట్ ఆడిన పీటర్, ఎప్పుడూ సున్నా వద్ద అవుట్ కాలేదు. ఆయన ఆట తీరులో నిలకడే ప్రత్యేక ఆకర్షణ.
2. కెప్లర్ వెస్సెల్స్ (ఆస్ట్రేలియా/దక్షిణాఫ్రికా)
- మ్యాచులు: 109
- పరుగులు: 3367
- సెంచరీలు: 1
- హాఫ్ సెంచరీలు: 26
- అత్యధిక స్కోరు: 107
- నాటౌట్ ఇన్నింగ్స్: 7
డకౌట్ లేదు.
ఒకే వ్యక్తిగా రెండు దేశాల తరపున ఆడిన అరుదైన క్రికెటర్ కెప్లర్ వెస్సెల్స్ కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు.
3. జాక్వెస్ రోడ్లాఫ్ (దక్షిణాఫ్రికా)
- మ్యాచులు: 45
- పరుగులు: 1174
- హాఫ్ సెంచరీలు: 7
- అత్యధిక స్కోరు: 81
- నాటౌట్ ఇన్నింగ్స్: 6
డకౌట్ లేదు.
జాక్వెస్ రోడ్లాఫ్ కూడా తన పూర్తి వన్డే కెరీర్లో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు.
క్రికెట్లో చిన్న తప్పుతో బ్యాటర్ డకౌట్ కావడం సహజం. కానీ ఈ ఆటగాళ్లు ఎంతో క్రమశిక్షణతో, స్టెడి పర్ఫార్మెన్స్తో ఎప్పుడూ “సున్నాకి ఔట్ కాకుండా తమ బ్యాటింగ్ కెరీర్‌ను కొనసాగించగలిగారు. ఇది సాధారణమైన విషయం కాదు. ఇంతటి కన్సిస్టెన్సీ, కూల్ మైండ్‌తో ప్రతీ ఇన్నింగ్స్ ఆడి అందరి మనసులు గెలుచుకున్నారు