ePaper
More
    Homeబిజినెస్​Stock Markets | కోలుకున్న మార్కెట్లు.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    Stock Markets | కోలుకున్న మార్కెట్లు.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) వరుసగా రెండో రోజూ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమైనా.. లాభాలను నిలబెట్టకోలేకపోయాయి. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని ఫ్లాట్‌గా ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ(FMCG) షేర్లు పతనమైనా.. ఆటో, మెటల్‌ స్టాక్స్‌ నిలబెట్టాయి.

    జీఎస్టీ సంస్కరణలతో ఆటో షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. వరుసగా మూడో సెషన్‌లోనూ ఆటో సెక్టార్‌(Auto sector) లాభాల బాటలో సాగింది. దీనికి తోడు గ్లోబల్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడంతో చివరలో మన సూచీలు తేరుకున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 294 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 24 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 715 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ(Nifty) 84 పాయింట్ల లాభంతో ప్రారంభమై 14 పాయింట్లు లాభపడిరది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 211 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 80,710 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 24,741 వద్ద స్థిరపడ్డాయి.

    Stock Markets | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

    బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,134 కంపెనీలు లాభపడగా 1,957 స్టాక్స్‌ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 135 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 64 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    Stock Markets | రాణించిన ఆటో, మెటల్‌ స్టాక్స్‌..

    బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌(Auto index) 1.30 శాతం పెరగ్గా.. టెలికాం 0.96 శాతం, మెటల్‌ 0.71 శాతం లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్‌ 1.44 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.22 శాతం, రియాలిటీ 1.07 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.09 శాతం, లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.01 శాతం పెరగ్గా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 0.10 శాతం నష్టపోయింది.

    Stock Markets | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో ఉండగా.. 16 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
    ఎంఅండ్‌ఎం 2.34 శాతం, మారుతి 1.70 శాతం, పవర్‌గ్రిడ్‌ 1.21 శాతం, రిలయన్స్‌ 1.11 శాతం, ఎయిర్‌టెల్‌ 0.84 శాతం లాభపడ్డాయి.

    Stock Markets | Top losers..

    ఐటీసీ2.01 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.55 శాతం, టీసీఎస్‌ 1.53 శాతం, టెక్‌ మహీంద్రా 1.43 శాతం, ఇన్ఫోసిస్‌ 1.29 శాతం నష్టపోయాయి.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...