ePaper
More
    Homeఅంతర్జాతీయంUS President Trump | మాట మార్చేసిన ట్రంప్‌.. మూడు యుద్ధాల‌నే ఆపాన‌ని వెల్ల‌డి

    US President Trump | మాట మార్చేసిన ట్రంప్‌.. మూడు యుద్ధాల‌నే ఆపాన‌ని వెల్ల‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: US President Trump | నోటికొచ్చింది వాగ‌డం, ఆ త‌ర్వాత మాట మార్చ‌డం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అల‌వాటుగా మారింది. త‌న‌ను తాను శాంతి దూత‌గా ప్ర‌చారం చేసుకునే ఆయ‌న‌.. అనేక సంఘ‌ర్ష‌ణ‌ల‌ను ఆపాన‌ని చెప్పుకుంటున్నారు.

    ఈ క్ర‌మంలో ఏడు యుద్ధాల‌ను ఆపాన‌ని ఇన్నాళ్లు చెప్పుకుంటూ వ‌చ్చిన ట్రంప్‌ (US President Trump).. ఇప్పుడు తాజాగా మాట మార్చారు. ఏడు యుద్ధాలను ఆపాన‌ని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చిన ట్రంప్‌.. ఇప్పుడు నాటకీయంగా మూడు యుద్ధాలను విజయవంతంగా ఆపిన‌ట్లు పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నాయని సైనిక ఘ‌ర్ష‌ణ‌లు ఇపిన‌ట్లు చెప్పిన ట్రంప్‌.. అయితే, అవి ఏమిటో మాత్రం చెప్ప‌లేదు. మ‌రోవైపు, ఇండియా, పాకిస్తాన్ (Pakistan) మ‌ధ్య యుద్ధాన్ని తానే ఆపాన‌ని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన అమెరికా అధ్య‌క్షుడు.. ఇప్పుడు మాట మార్చ‌డం గ‌మ‌నార్హం.

    US President Trump | క‌ష్ట‌మైనా ప‌రిష్క‌రిస్తా…

    వైట్ హౌస్‌లో (White House) టెక్ దిగ్గ‌జాల‌తో నిర్వ‌హించిన విందు అనంత‌రం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధాన్ని ఆప‌డం క‌ష్టంగా మారింద‌ని, అయిన‌ప్ప‌టికీ దాన్ని ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే తాను మూడు యుద్ధాల‌ను ఆపాన‌ని తెలిపారు. అయితే, అవి ఏయే దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధాలో చెప్ప‌లేదు. “నేను మూడు యుద్ధాలను పరిష్కరించా. ఒకటి 31 సంవత్సరాలుగా కొన‌సాగుతున్న సంఘ‌ర్ష‌ణ. ఇందులో 10 మిలియన్ల మందికి పైగా మరణించారు, మరొకటి 34 సంవత్సరాలు కొన‌సాగుతుండ‌గా, ఇంకొక‌టి 37 సంవత్సరాలుగా యుద్ధం కొన‌సాగుతోంది. నేను అధ్య‌క్షుడిగా అయ్యాక వాటిని ఆపాన‌ని” చెప్పుకొచ్చారు. విమర్శకులు తాను చేస్తున్న‌ శాంతి ప్ర‌య‌త్నాల‌ను, త‌న తన సామర్థ్యాన్ని అనుమానించారని ట్రంప్ నొక్కిచెప్పారు.

    US President Trump | అంతా ఉత్త‌దే..

    భార‌త్‌ (India), పాకిస్తాన్ మ‌ధ్య ఇటీవ‌ల చోటు చేసుకున్న సైనిక సంఘ‌ర్ష‌ణ‌ను తానే ఆపాన‌ని ట్రంప్ ఇన్నాళ్లు చెప్పుకుంటూ వ‌చ్చారు. కానీ, తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న యుద్ధాల‌నే ఆపాన‌ని చెప్ప‌డంతో.. ఇండియా-పాక్ సంఘ‌ర్ష‌ణ‌ల‌పై ఇన్నాళ్లు ఆయ‌న చెబుతున్న‌ది అబ‌ద్ధ‌మ‌ని తేలిపోయింది. తాను వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చి రెండు దేశాల మ‌ధ్య యుద్ధాన్ని ఆపాన‌ని ట్రంప్ ప‌దే ప‌దే చెప్పారు.

    More like this

    Bigg Boss 9 | గ్రాండ్‌గా బిగ్ బాస్ లాంచింగ్​.. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 (Bigg boss 9) ఎప్పుడెప్పుడు...

    Sriram Sagar Gates Lifted | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎనిమిది గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, మెండోరా: Sriram Sagar Gates Lifted : ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరామ్​ సాగర్​ జలాశయంలోకి ఇన్​ఫ్లో...

    Amaravati Property Festival | అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌ 2025.. మూడు రోజుల పాటు ప్ర‌త్యేక రాయితీలు

    అక్షరటుడే, అమరావతి: Amaravati Property Festival | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిబింబిస్తూ.. నేషనల్ రియల్ ఎస్టేట్...