ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaithanya | గణేశ్​ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

    CP Sai Chaithanya | గణేశ్​ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaithanya | గణేశ్​ నిమజ్జనం (Ganesh immersion) సందర్భంగా నిర్వహిస్తున్న ప్రదేశాలను సీపీ సాయిచైతన్య పర్యవేక్షించారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి స్వయంగా కొద్దిదూరం బైక్ నడుపుతూ వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు.

    బాసర (basara), ఉమ్మడి బ్రిడ్జి, బోధన్ (Bodhan), బోర్గాం తదితర ప్రదేశాలను సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేందుకు పోలీస్​శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు.

    CP Sai Chaithanya | కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం..

    నిమజ్జక కార్యక్రమం శాంతియుతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు సీపీ సాయిచైతన్య వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతాపరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

    ప్రజలందరూ పోలీసులకు సహకారాన్ని అందించాలని, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ నంబర్‌కు కాల్​ చేయాలని సూచించారు. నిమజ్జన వేడుకను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని తెలిపారు. సీపీ వెంట ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు మరియు బందోబస్తు సిబ్బంది ఉన్నారు.

    More like this

    TVS NTORQ 150 లాంచింగ్​.. ఫస్ట్​ హైపర్ స్పోర్ట్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత్​లో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ TVS NTORQ 150 ని టీవీఎస్...

    BJP Yellareddy | నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గించడం భేష్​.. బీజేపీ నాయకులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : BJP Yellareddy | కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై బీజేపీ...

    GPO | కొత్త జీపీఓలకు కౌన్సెలింగ్

    అక్షరటుడే, ఇందూరు: GPO | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామపంచాయతీ అధికారుల (Gram Panchayat Officers) నియామకాలు చేపట్టింది....