ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​H-160 Helicopter | భద్రత, వేగం లక్ష్యంగా చంద్రబాబు నాయుడుకు అత్యాధునిక హెచ్-160 హెలికాప్టర్

    H-160 Helicopter | భద్రత, వేగం లక్ష్యంగా చంద్రబాబు నాయుడుకు అత్యాధునిక హెచ్-160 హెలికాప్టర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: H-160 Helicopter | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రత మరియు పర్యటనల వేగాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయన కోసం అత్యాధునిక ఎయిర్‌బస్ హెచ్-160 హెలికాప్టర్‌(H-160 Helicopter)ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

    ఇప్పటికే గత రెండు వారాలుగా సీఎం జిల్లా పర్యటనలన్నింటికీ ఈ కొత్త హెలికాప్టర్‌నే వినియోగిస్తున్నారు.ఇప్పటివరకు వినియోగించిన బెల్ మోడల్ హెలికాప్టర్‌కు బదులుగా, అత్యాధునిక సాంకేతికతతో తయారైన హెచ్-160 మోడల్‌ను ఎంపిక చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇది కేవలం వేగవంతమైనదే కాకుండా, ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా సురక్షితంగా ప్రయాణించగల సామర్థ్యం కలిగిఉంది.

    H-160 Helicopter | ఆల‌స్యం ఉండ‌దు..

    ఈ మార్పుతో ముఖ్యమంత్రి పర్యటనలలో సమయాన్ని గణనీయంగా ఆదా చేయడం సాధ్యమవుతోంది. గతంలో వన్ బై వన్ ప్రయాణం చేయాల్సి వచ్చేది. అంటే ముందుగా ఉండవల్లి(Undavalli)లోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సంబంధిత జిల్లాకు, ఆపై రోడ్డుమార్గంలో కార్యక్రమ స్థలానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ మొత్తం సమయపరంగా కాస్త క్లిష్టంగా మారేది. ఇప్పుడు మాత్రం నేరుగా నివాసం నుంచే జిల్లాలకు హెలికాప్టర్ ప్రయాణం సౌలభ్యం కలిగింది. పెరిగిన భద్రతా ప్రమాణాలు కూడా ఈ కొత్త హెలికాప్టర్ ప్రత్యేకతల్లో ఒకటి. పైలట్లు కాకుండా మరో ఆరుగురు వరకు ఇందులో సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారు. అంతే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి సదుపాయాలు ఇందులో నిక్షిప్తంగా ఉన్నాయి.

    సమగ్రంగా చూస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandra Babu Naidu) ప్రజలతో మరింత సమీపంగా ఉండేందుకు, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ పర్యటనలు చేపట్టేందుకు ఈ హెలికాప్టర్  కీల‌కంగా మారనుంది. భవిష్యత్‌లో మరిన్ని సమర్థవంతమైన పాలన చర్యలకు ఇది దోహదపడుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ (విశాఖపట్నం రైల్వే జోన్ జీఎం) సందీప్‌ మాథుర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కొత్త జోన్‌కు సంబంధించి ప‌లు అంశాలపై చర్చించారు. జోన్‌ కోసం జరుగుతున్న కసరత్తు.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, రూపొందిస్తున్న డీపీఆర్‌ల గురించి సీఎంకు ఆయ‌న తెలియ‌జేయ‌డం జ‌రిగింది..

    More like this

    Red Sea | ఎర్ర సముద్రంలో తెగిన ఇంటర్నెట్ కేబుల్స్.. పాక్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Red Sea | ఎర్ర సముద్రంలో అండర్‌సీ ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోవడంతో పాకిస్థాన్‌ (Pakistan) సహా...

    Rajagopal Reddy | ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధం.. మరోసారి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు...

    Boney Kapoor | శ్రీదేవి కోరిన కోరిక‌లు నిజ‌మే.. శివ‌గామి పాత్ర చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే అన్న బోనీ క‌పూర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Boney Kapoor | ఇండియన్ సినిమా చరిత్రను మార్చిన చిత్రం ‘బాహుబలి’, దాని సీక్వెల్ గా...