ePaper
More
    HomeజాతీయంIndian Premier League 2025 | రోబో డాగ్ వ‌ల‌న బీసీసీఐకి లేని పోని చిక్కులు.....

    Indian Premier League 2025 | రోబో డాగ్ వ‌ల‌న బీసీసీఐకి లేని పోని చిక్కులు.. ఏకంగా హైకోర్టు నోటీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Premier League 2025 : ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో అనేక హైలైట్స్ చోటు చేసుకుంటుండ‌టం మ‌నం చూశాం. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో AI రోబో కుక్క ఆకట్టుకుంటోంది. దానికి ‘చంపక్’ అని పేరు పెట్టింది బీసీసీఐ. AI రోబో కుక్కకు ‘చంపక్’ అని పేరు పెట్టడం ఇప్పుడు చిక్కుల్లో ప‌డేసింది.

    ఇది ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన అవుతుందని పేర్కొంటూ పిల్లల పత్రిక చంపక్ Champak ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ రోబోటిక్ కుక్కను నిర్వాహకులు ప‌రిచ‌యం చేశారు. సోషల్ మీడియాలో రోబోటిక్ కుక్కకు తాము ఎంచుకున్న పేర్లలో ఎక్కువ మంది చంపక్ పేరుకే ఓటేశారని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు వెల్లడించారు.

    Indian Premier League 2025 : బీసీసీఐకే షాక్..

    చంప‌క్..నిజానికి ఒక ప్రసిద్ధ పిల్లల పత్రిక పేరు. ఈ క్రమంలో ఈ కంపెనీ, బీసీసీఐకి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రోబో కుక్కకు చంపక్ అని పేరు పెట్టడం ద్వారా బీసీసీఐ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని పత్రిక డైరెక్టర్ల బోర్డు ఆరోపించింది. రోబో ROBO కుక్కకు చంపక్ అని పేరు పెట్టడంపై స్పందన కోరుతూ ఢిల్లీ హైకోర్టు బీసీసీఐకి నోటీసు జారీ చేసింది. 1968వ సంవత్సరం నుంచి తాము చంపక్ పేరుతో పిల్లల కోసం మ్యాగజైన్ ప్రచురిస్తున్నట్లు.. తమ అనుమతి లేకుండానే తమ ట్రేడ్ మార్కును వాడుకున్నారంటూ వారు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

    ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో దాఖ‌లైన పిటీష‌న్‌లో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐకి కోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా సమాధానంతో తమ ముందుకు రావాలని బీసీసీఐ, ఐపీఎల్ ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఐపీఎల్ లో ప్రవేశపెట్టినప్పటి నుంచి రోబోట్ డాగ్ చంపక్ అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు IPL ఆకర్షణీయంగా మారింది. బీసీసీఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జె.సాయి దీపక్ ఈ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. చంపక్ అనేది ఒక పువ్వు పేరు అని.. ప్రజలు రోబో కుక్కను ఒక పత్రికతో కాకుండా ఒక టీవీ సీరీస్ లోని పాత్రతో పోల్చుకుంటారని అన్నారు.

    Latest articles

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    More like this

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...